Wednesday: బుధవారం రోజు తల స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది స్త్రీ,పురుషులు బిజీ బిజీ షెడ్యూల్ వల్ల కనీసం స్నానం చేయడానికి కూడా సమయం ఉండడం లేదు. ఇంకా చెప్పాలంటే ఉదయం సమ

Published By: HashtagU Telugu Desk
Wednesday

Wednesday

ఈ రోజుల్లో చాలామంది స్త్రీ,పురుషులు బిజీ బిజీ షెడ్యూల్ వల్ల కనీసం స్నానం చేయడానికి కూడా సమయం ఉండడం లేదు. ఇంకా చెప్పాలంటే ఉదయం సమయంలో ఆఫీసులోకి వెళ్లేవారు రాత్రి సమయంలోనే స్నానం చేసి ఉదయాన్నే ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేయకుండా అలాగే వెళ్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే మామూలుగా మనం వారాలతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చేస్తూ ఉంటాం. కానీ అలా చేయకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. వాస్తు శాస్త్రంగా కొన్ని రోజుల్లో తల స్నానం అస్సలు చేయకూడదు.

మరి ఏ రోజు తలస్నానం చేయాలో, చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం రోజున తలస్నానం చేస్తే అందం తగ్గుతుంది. కలత, సంతాపం కలుగుతుంది. ఒకవేళ అవసరమైతే నూనెలో పువ్వులు వేసి తలంటుకుని స్నానం చేయాలి. అలాగే సోమవారం రోజున తలస్నానం చేయడం అంత మంచిది కాదు. ఒకవేళ చేస్తే కాంతి హీనత, భయం ఉంటుందట. మంగళవారం రోజు తలస్నానం చేస్తే విరోధం, అపాయం, ఆయుఃక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. ఇక బుధవారం రోజు తలస్నానం చేస్తే అన్నివిధాలా శుభం. ఇక గురువారం రోజు తలస్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది. అశాంతి, విద్యా లోపం, ధన వ్యయం, కీడు, శత్రు వృద్ధి.

అవసరమైతే నూనెలో గరిక వేసి తలంటు స్నానం చేయాలి. శుక్రవారం రోజున తలస్నానం చేస్తే అశాంతి, వస్తునాశం, రోగప్రదం. కానీ కొందరు సౌఖ్యప్రదం. శనివారం రోజున తలస్నానం చేయడం వలన ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ, కుటుంబ సౌఖ్యం, భోగం, శుభం కలుగుతుంది.

  Last Updated: 14 Aug 2023, 09:24 PM IST