Site icon HashtagU Telugu

Shivalingam: శివలింగాన్ని పూజించినట్టు కల వచ్చిందా.. అయితే జరగబోయేది ఇదే!

Shivalingam

Shivalingam

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు రావడం అన్నది సహజం. కొన్నిసార్లు మంచి కలలు వస్తే మరి కొన్నిసార్లు చెడ్డ కలలు వస్తూ ఉంటాయి. మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడి చెడ్డ కలలు వచ్చినప్పుడు భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే కలలో మనకు దేవుళ్ళు దేవతలు కనిపించడంతోపాటు వారికి పూజ చేస్తున్నట్టు కూడా కలలు వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మీకు కలలో పరమేశ్వరుడికి పూజ చేస్తున్నట్టు కల వచ్చిందా, అలా వస్తే దాని అర్థం ఏంటో దాని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కాగా కలలో శివలింగాన్ని పూజించినట్లు వస్తే మన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయడానికి సంకేతం అని చెబుతున్నారు. అయితే శివుడిని పూజించినట్లు కల రావడం వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే నిద్రిస్తున్న సమయంలో మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా పరిగణించాలట. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు. అలాగే ఆ శివుడి ఆశీస్సులతో మీరు అనుకున్న పని కూడా నెరవేరుతుందట.

కలలో శివలింగాన్ని పూజించినట్లుగ మీకు కనిపిస్తే మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయని అర్థం అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. శివలింగాన్ని పూజించినట్లు కల వస్తే మీ జీవితంలో సమస్యలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయని అర్థం అంటున్నారు. అలాగే ఎప్పుడైనా కలలో తెల్లని శివలింగం కనపడటం కూడా శుభపరిణామంగా భావించవచ్చట. ఇలా తెల్లటి శివలింగం కనబడితే కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయట పడతారని అర్ధం అంటున్నారు. అలాగే ఎప్పుడైనా శివాలయం మెట్లు ఎక్కుతున్నట్లు కళ వచ్చినా కూడా అదే శుభ పరిణామంగా భావించాలట. ఎందుకంటే ఇలా కల రావడం వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుందని అర్థం అంటున్నారు.