Vastu : రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే జరిగేది ఇదే, తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిజాలు ఇవే..!!

రావిచెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావిచెట్టు ఇంట్లోకానీ...ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 07:00 AM IST

రావిచెట్టును దైవ వృక్షంగా భావించి పూజిస్తారు. కానీ రావిచెట్టు ఇంట్లోకానీ…ఆరుబయట కానీ పెరిగితే అశుభంగా పరిగణిస్తుంటారు.కాబట్టి పొరపాటున ఇంట్లో కానీ మీ ఇంటికి సమీపంలో కానీ రావిచెట్టును పెంచినట్లయితే ఏం చేయాలి. ఏం చేయకూడదో తెలుసుకుందాం.

వాస్తుశాస్త్రం ప్రకారం..సానుకూల శక్తిని కాపాడుకోవడంలో చెట్లు, మొక్కలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కొన్ని మొక్కలు సానుకూల శక్తిని అందిస్తే..మరికొన్ని ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఇంటి చుట్టూ ప్రతికూల శక్తిని కలిగించే మొక్కలు ఉంటే వాటిని తీసేయాలి. అలాంటి చెట్లలో ఒకటి రావి చెట్టు. హిందుమతంలో రావిచెట్టుకు చాలా ముఖ్యస్థానం ఉంది. అయితే రావి చెట్టు నీడ ఇంటిపై పడకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ చెట్టు ఉంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవట. ఇంటి ఆవరణలో రావి చెట్టు ఉంటే ఎలా తొలగించాలో తెలుసుకుందాం.

రావిచెట్టు ప్రాముఖ్యత:
మీ ఇంటి పరిసరాల్లో రావి చెట్టు ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. రావి చెట్టు అనేక సందర్బాల్లో పూజిస్తారు. కానీ ఇంట్లో పెంచడం అశుభం. ఈ చెట్టు ఏ ఇంట్లో అయితే పెరుగుతందో ఆ ఇంట్లో పేదరికం వ్యాపిస్తుందని అంటారు. సైన్స్ ప్రకారం రావిచెట్టు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. కానీ రాత్రి పూట కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయి. ఇది పీల్చడం ద్వారా మనకు హానీ కలుగుతుంది. అందుకే పురాణాల ప్రకారం ఉదయం మధ్యాహ్నం మాత్రమే రావి చెట్టు దగ్గరకు వెళ్లాలి.

రావి చెట్టు నీడ ఇంట్టి పై పడుతుంటే.
రావి చెట్టును ఇంట్లో కానీ ఇంటికి సమీపంలో కానీ పెంచకూడదు. రావి చెట్టు నీడ ఎవరి ఇంటి పై పడుతుందో ఆ ఇంట్లో ఉన్నతి కుంటుపడుతుంది. ఇలాంటి ఇళ్లలో నిత్యం గొడవలు జరుగుతుంటాయి. రావి చెట్టు వేర్లు ఇంటిని ధ్వంసం చేస్తాయి. కాబట్టి రావి చెట్టు నీడ ఇంటిపై పడకూడదని పురాణాల్లో ఉంది.

రావి చెట్టును ఇలా తొలగించండి.
రావి చెట్టును తొలగించాలంటే అంత సులభం కాదు. ముందుగా 45 రోజుల పాటు పూజించాలి. దానిపై పచ్చిపాలను సమర్పించాలి. ఆ తర్వాత చెట్టును తీసి ఇతర ప్రాంతాల్లో నాటాలి. మీ ఇంటి ముందు ఇప్పటికే భారీ చెట్టు ఉన్నట్లయితే దాని నీడ ఇంటిపై పడితే..మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం మొదలవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆదివారం నాడు ఆ చెట్టును పూజించండి. ఎలాంటి పూజ లేకుండా చెట్టును నరకడం వల్ల పితృ దోషం వస్తుంది.