Dream: చనిపోయిన వారు కలలో కనిపించడం మంచిదేనా.. అలా కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మామూలుగా మనకు ఇష్టమైన వారు చనిపోయినప్పుడు వారి జ్ఞాపకాలు వారితో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని పదేపదే బాధపడుతూ ఉంటాము. అలా రాత్రి పగలు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 02 Dec 2023 03 18 Pm 3680

Mixcollage 02 Dec 2023 03 18 Pm 3680

మామూలుగా మనకు ఇష్టమైన వారు చనిపోయినప్పుడు వారి జ్ఞాపకాలు వారితో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని పదేపదే బాధపడుతూ ఉంటాము. అలా రాత్రి పగలు అని తేడా లేకుండా నిరంతరం వారి గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు అలాంటి వారికి సంబంధించిన కలలు కూడా వస్తూ ఉంటాయి. అలా అనుకోకుండా మనకు అప్పుడప్పుడు చనిపోయిన వారు కలలో కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అలా చనిపోయిన వారి కళ్ళల్లో కనిపించడం మంచిదేనా? అలా కనిపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా కలలో భవిష్యత్తుని తెలుపుతాయని అంటూ ఉంటారు. అలాంటిది చనిపోయిన వారు గనుక కలలో నిరంతరం వస్తూ ఉంటే మీరు దాని నుంచి బయటపడడానికి ఆ మానసిక స్థితి నుంచి మీరు బయటపడడానికి ఉపశమనం పొందడానికి ఆ తర్వాత రోజు ఎవరైనా పేద వ్యక్తికి సహాయం చేయాలి. అలాగే వారీ ఆశీర్వాదాలు అలాగే సహాయం పొందినటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో దాని ఫలితం చనిపోయి మీకు కలలో కనిపిస్తున్న వ్యక్తికి చేరుతుంది. వారు ప్రశాంతంగా ఉంటారు.

అయినా సరే ఇలాంటి కలలు ప్రతినిత్యం వస్తూ ఉంటే మీరు అమావాస్య రోజున ఏదైనా ఆలయానికి వెళ్లి ఆలయానికి దానంగా ఏదైనా ఇవ్వాలి. అలా చేయడం వల్ల మీకు తప్పక దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇల్లు కోల్పోయినట్టు కంటి చూపు సమస్య వచ్చినట్టు ఏదో ఫ్రాక్చర్ అయినట్టు నడవలేకపోతున్నట్టు చూడలేకపోయినట్టు తినలేకపోయినట్టు ఇలాంటి కొన్ని కలలు వస్తూ ఉంటాయి. అంటే మనకేదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అని తెలియజేసే టువంటి కలలు మన జీవితంలో రాబోయే మార్పుల గురించి తెలియజేస్తాయి. అయితే వీటి గురించి ఆందోళన చెందక్కర్లేదు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు.

  Last Updated: 02 Dec 2023, 03:18 PM IST