Site icon HashtagU Telugu

Waist Thread: పురుషులు మొలతాడును కట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే?

Mixcollage 15 Mar 2024 04 00 Pm 4555

Mixcollage 15 Mar 2024 04 00 Pm 4555

మామూలుగా మగవాళ్ళు మొలతాడు దరిస్తూ ఉంటారు. కొందరు ఎర్ర మొలతాడు దరిస్తే మరి కొందరు నల్ల మొలతాడును మరికొందరు వెండి మొలతాడు ధరిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ధరించాలి అంటే మగవాళ్లు అన్నాక మొలతాడు ఖచ్చితంగా కట్టుకోవాలనే నియమం కూడా ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. అయితే దీన్ని నేటికీ కూడా పాటిస్తూ వస్తున్నారు. చిన్న పిల్లలకు కూడా మొలతాడును ఖచ్చితంగా కడతారు.పాత పడిన తర్వాత కొత్తది కట్టి పాతమొలతాడును తీసేస్తుంటారు. కానీ మొలతాడు లేకుండా మాత్రం ఉండరు.

ఇలా ఉండకూడదని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. అయితే ఒకప్పుడు అంటే బెల్టులు అందుబాటులో లేని కాలంలో పంచెలు, లుంగీలు, ప్యాంటులు జారిపోకుండా ఉండేందుకు వీటిని ఉపయోగించేవారు. అయితే వీటిని సపరేట్ గా వీటికోసమే ఉపయోగించేవారు కాదు. మొలతాడుకు ఇలా కూడా ఉపయోగించేవారు. మొలతాడు లేకుండా ఉండటం అంటే చనిపోవడమనే అర్థం వస్తుంది. పెద్దల ప్రకారం.. చనిపోయినప్పుడు మాత్రమే మొలతాడును తీసేస్తారు. అందుకే మొలతాడును ఎప్పుడూ నడుముకు ఉండేలా చూస్తారు. అలాగే ఎనకటి కాలంలో డాక్టర్లు, హాస్పటల్స్ ఎక్కువగా ఉండేవి కావు.

కాబట్టి పాము కరిస్తే మొలతాడును తెంపి పాము కుట్టిన దగ్గర కట్టి విషయాన్ని తీసేసేవారని కూడా పెద్దలు చెప్తుంటారు. బ్లాక్ లేదా ఎర్రని మొలతాడును ఎక్కువగా కట్టుకుంటుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మొలతాడు మగవారికి దిష్టి తగలకుండా కాపాడుతుంది. ఇది చెడు కంటి నుంచి రక్షిస్తుందని చెప్తారు. అందుకే మొలతాడును ఎప్పటి నుంచో కట్టుకునే ఆచారం మొదలైంది. అది నేటికీ కూడా కొనసాగుతూ వస్తోంది. ఏదేమైనా మొలతాడును మగవారు మాత్రమే కట్టుకుంటారు. కానీ దీన్ని ఆడవాళ్లు కూడా కట్టుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది చేతికి లేదా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. ఎందుకందే ఇది కూడా దిష్టి తగలకుండా కాపాడుతుంది. నల్లదారం దుష్టశక్తులకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. సైన్స్ ప్రకారం.. మొలతాడు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. దీన్ని కట్టుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. హెర్నియా వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మొలతాడును కట్టుకోవడం వల్ల పురుషుల జననేంద్రియాలు ఆరోగ్యంగా ఉంటాయనే నమ్మకం కూడా ఉంది.

Exit mobile version