Site icon HashtagU Telugu

Black Thread : నల్లదారం కట్టుకునేటప్పుడు పాటించాల్సిన రూల్స్

Black Thread

Black Thread

Black Thread : చేతికి, పాదాలకు, నడుముకు నల్లదారం చుట్టుకోవడం వెనుక బలమైన నమ్మకాలు ఉన్నాయి. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. నలుపు రంగు శనిగ్రహాన్ని సూచిస్తుంది. పాదాలకు నలుపు దారాన్ని ధరించిన వ్యక్తికి రక్షకుడిగా శని దేవుడు ఉంటాడని నమ్ముతారు. నల్ల దారాన్ని.. దానికి 9 ముళ్ళు వేసిన తర్వాతే కట్టుకోవాలి. నలుపు దారం ధరించిన తర్వాత కాలికి మరో రంగు దారాన్ని కట్టకూడదు.

We’re now on WhatsApp. Click to Join.

నల్లదారం ప్రభావాన్ని తీవ్రతరం చేయడం కోసం గాయత్రి మంత్రాన్ని చదివిన తర్వాతే దీన్ని కట్టుకోండి. ఆ తర్వాత కూడా ప్రతిరోజూ ఈ మంత్రాన్ని జపించండి. ప్రతిరోజు ఒకే టైంలో గాయత్రీ మంత్రాన్ని చదవాలి. దారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పురుషులు ఎల్లప్పుడూ తమ కుడి కాలులో నల్లటి దారం కట్టుకోవాలి. మంగళవారం లేదా శనివారం మాత్రమే నల్ల దారం ధరిస్తారని గుర్తుంచుకోవాలి.

Also Read: Singareni: సింగరేణి లో రాజకీయ పార్టీల సైరన్, కార్మికుల ఓట్లే లక్ష్యంగా క్యాంపెయిన్!

నల్ల దారం వల్ల చెడు దృష్టి నుంచి  రక్షణ కూడా లభిస్తుంది. ఇది మీ వైపు వచ్చే ప్రతికూల శక్తుల ప్రభావాన్ని ఆపుతుంది. చేతబడి ప్రభావాలు కూడా లేకుండా చేస్తుంది. జాతకంలో బలహీనమైన రాహు, కేతువులు ఉన్నవారు పాదాలకు నల్ల దారం కట్టుకుంటే.. ప్రతికూల ప్రభావం నుంచి రక్షణ పొందుతారు. ముఖ్యంగా దేవాలయాల్లో పూజ చేసిన తర్వాత చేతికి కొందరు నల్లని దారాన్ని లేదా ఎర్రని దారాన్ని కట్టుకుంటారు.  ఇలా రక్షా దారాన్ని కట్టుకోవడంతో పూజ పరిపూర్ణం అయినట్లుగా భావిస్తారు. హిందూ మతంలో ఈ దారం రక్షణ సూత్రంగా(Black Thread) పరిగణించబడుతుంది.

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

చేతికి రక్షణ దారం కట్టే సమయంలో

చేతి మణికట్టుకి రక్షణగా దారం కట్టుకుంటుంటే చేతి చుట్టూ మూడు సార్లు మాత్రమే చుట్టాలి. మత విశ్వాసం ప్రకారం ఇలా మూడు సార్లు చుట్టడానికి ఒక కారణం ఉంది.  సాధకుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఆశీర్వాదం పొందుతాడని విశ్వాసం. అంతేకాదు లక్ష్మీ దేవి, పార్వతి ఆశీస్సులు లభిస్తాయి. అదే సమయంలో గ్రహణం తర్వాత చేతికి ఉండే రక్షణ దారాన్ని తొలగించాలి. సూతక కాలంలో ఇది అపవిత్రంగా మారుతుందని నమ్ముతారు. కనుక గ్రహణం ముగిసిన తర్వాత చేతికి ఉన్న దారం తీసి దానిని ప్రవహించే నీటిలో వెయ్యాలి.  లేదా రావి చెట్టుకి కట్టాలి. అంతేకానీ ఎప్పుడు ఈ రక్షణ దారాన్ని చెత్తబుట్టలో వేయకూడదని గుర్తుంచుకోండి. అలా చేయడం అశుభంగా భావిస్తారు.

పాదాలకు నల్ల దారం కట్టే విషయంలో పాటించాల్సిన నియమం

పాదాలకు నల్ల దారం కట్టుకోవడం వల్ల జాతకంలో కుండలి దోషం తొలగిపోతుందని నమ్ముతారు. అదే సమయంలో నల్ల దారాన్ని కట్టడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శనివారం నల్ల దారాన్ని కట్టడం చాలా శుభప్రదంగా, ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మరింత ప్రభావవంతంగా ఉండడం కోసం  రుద్ర గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

Also Read: