Shell : ఇంట్లో ఎలాంటి శంఖాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో మీకు తెలుసా?

విష్ణు పురాణం ప్రకారం, లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని చెబుతారు. శంఖంలో (Shell) చాలా రకాలు ఉన్నాయి. హైంద‌వ‌ సంస్కృతిలో వివిధ రకాలైన శంఖాల‌కు వేర్వేరు ప్రాముఖ్యత ఉంది.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 07:00 PM IST

Worshipping Shell at Home : చాలామంది ఇంట్లో దేవుడి గదిలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమ‌ని విశ్వ‌సిస్తారు. పూజ సమయంలో శంఖం (Shell) ఊదడం వల్ల ఇంటి వాతావరణం అంతా శుభ్రం అవుతుందని నమ్ముతూ ఉంటారు. విష్ణు పురాణం ప్రకారం, లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని చెబుతారు. శంఖంలో (Shell) చాలా రకాలు ఉన్నాయి. హైంద‌వ‌ సంస్కృతిలో వివిధ రకాలైన శంఖాల‌కు వేర్వేరు ప్రాముఖ్యత ఉంది. అయితే మరి ఇంట్లో శంఖాన్ని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

కామధేను శంఖం ఆవు నోరులా ఉంటుంది. అందుకే దీనిని కామధేను శంఖం అంటారు. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచితే అన్ని పనులు సులువుగా పూర్తవుతాయని విశ్వాసం. గణేశ శంఖం.. వినాయకుని పూజలో గణపతి శంఖాన్ని ఉంచడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ శంఖాన్ని పూజించడం ద్వారా గణేశుని ఆశీస్సులు లభిస్తాయి. పనిలో ఎదురయ్యే అడ్డంకులు లేదా ఇబ్బందులు తొలగిపోతాయి.

ఈ శంఖాన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందువచ్చు .ముత్యాల శంఖాన్ని ఇంట్లో పూజిస్తే కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ఈ శంఖాన్ని ఇంట్లో ఉంచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి గదిలో తెల్లటి వ‌స్త్రంపై మోతీ శంఖాన్ని అంటే ముత్యపు శంఖాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.

అలాగే ఐరావత శంఖాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా, ఇంటి వాస్తు దోషాన్ని తొలగి మీరు వాస్తు ప్రయోజనాలను పొందుతారు. ఈ శంఖాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంద‌ని నమ్ముతారు. ఈ శంఖంలోని నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కార్యాలయంలో మణి పుష్పక శంఖాన్ని ఉంచడంతో పాటు దానిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల మీకు కీర్తి, గౌరవం లభిస్తాయి. పని ప్రదేశంలో ఉంచిన మ‌ణి పుష్ప‌క‌ శంఖం ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందేందుకు మీకు సహాయం చేస్తుంది.

Also Read:  Sedan Car: రూ.12 లక్షలకే అద్భుతమైన కారు.. ఫీచర్లు ఇవే..!