Site icon HashtagU Telugu

7 Steps Meaning in Message : పెళ్ళిలో వధువు వరుడు 7 అడుగులు వేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మీతో మీకు తెలుసా?

Do You Know The Meaning Behind Taking 7 Steps Of Bride And Groom In Marriage

Do You Know The Meaning Behind Taking 7 Steps Of Bride And Groom In Marriage

Meaning behind taking 7 Steps in Marriage : హిందూ సంప్రదాయంలో పూర్వకాలం నుంచి ఇప్పటికి ఎన్నో రకాల విషయాలను అలా పాటిస్తూనే వస్తున్నారు. హిందూ ధర్మంలో 16 ఆచారాలు ఉండగా అందులో వివాహం (Marriage) కూడా ఒకటి. ఇక హిందువులు వివాహంలో (Marriage) పసుపు కొట్టడం నుంచి అరుంధతి నక్షత్రం చూపించడం వరకు ఎన్నో రకాల విషయాలను ఎప్పటినుంచో పాటిస్తూనే వస్తున్నారు. అటువంటి వాటిలో ఏడు అడుగులు (7 Steps) నడవడం కూడా ఒకటి. ఇంతకీ ఈ ఏడు అడుగులు (7 Steps) ఎందుకు నడుస్తారు? వాటి వెనక ఉన్న అంతర్యం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

1. మొదటి అడుగు..

తాను ఇప్పటి నుంచి చేసే ఏ కర్మలోనైనా భార్య‌ను భాగస్వామిని చేస్తాన‌ని మొదటి ప్ర‌ద‌క్షిణ‌లో పెళ్లికొడుకు ప్ర‌మాణం చేస్తాడు. ఎక్కడికి వెళ్లిన ఎటువంటి శుభకార్యానికి వెళ్ళినా కూడా తనతో పాటు తన భార్యను తీసుకెళ్లడానికి అంగీకరించాల‌ని వ‌ధువును కోర‌తాడు. ఏ రకమైన ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన పనిలోనైనా, నేను మీ ఎడమ ప‌క్క‌నే ఉంటూ, నా బాధ్యతలను పూర్తి భక్తితో, శ్ర‌ద్ధ‌తో నిర్వహిస్తానని వధువు వరుడికి మొదటి ప్ర‌మాణం చేస్తుంది.

2. రెండవ అడుగు..

ఇక రెండవ అడుగులో, మీరు మీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో, ఈ రోజు నుంచి నా తల్లిదండ్రులను కూడా అదే విధంగా గౌరవించాలి, కుటుంబ గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాల‌ని వ‌రుడు వ‌ధువును కోర‌తాడు. దీనికి అంగీక‌రిస్తే, త‌న‌తో తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని చెబుతాడు. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని వధువు వరుడికి మరో ప్ర‌మాణం చేస్తుంది.

3. మూడవ అడుగు..

ఒక వ్యక్తి జీవితంలో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే మూడు దశలు ఉన్నాయని, ఈ మూడు దశలలో నాతో ఉంటూ, అన్ని వేళ‌ల్లో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, నేను 3 వ అడుగు వేస్తానని వ‌రుడు వ‌ధువుకు చెబుతాడు. దానికి ప్రతిగా, నా జీవితాంతం నీకు సేవ చేస్తానని అది తన కర్తవ్యం అని వధువు ప్ర‌మాణం చేస్తుంది.

4. నాలుగో అడుగు..

పెళ్లి తర్వాత మా కుటుంబ బాధ్యతలన్నీ మీపైనే ఉంటాయి. మా ఇంటి బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ‌లో మీరు ఎల్లప్పుడూ నాతో ఉండటానికి సిద్ధంగా ఉంటే, నేను ఖచ్చితంగా నాలుగో అడుగు వేస్తాను అని వ‌రుడు వ‌ధువ‌కు ప్ర‌మాణం చేస్తాడు. వధువు 16 ఆభరణాలను ధరించి, పూర్తి అంగీకారంతో వరుడికి సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతూ నాలుగో ప్రదక్షిణ చేస్తుంది.

5. ఐదవ అడుగు..

మీరు చేసే వ్యాపారంలో, మీరు చేసే ప్రతి ఖర్చులో మీ భాగస్వామిగా న‌న్ను చేసుకోండి. అంటే డబ్బుకు సంబంధించిన ఏ కార్యకలాపమైనా నేను మీకు అండ‌గా ఉంటాన‌ని వ‌రుడు వ‌ధువుకు ప్ర‌మాణం చేస్తాడు. త‌న ప్ర‌తిపాద‌నకు అభ్యంతరం లేకపోతే మీతో ఐదవ అడుగు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అడుగుతాడు. అందుకు ప్ర‌తిగా మీ జీవితంలో ఎలాంటి సంతోషం, విచారం జరిగినా, నేను ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తానని వ‌ధువు హామీ ఇస్తుంది.

6. ఆరవ అడుగు..

ఇక ఆరవ అడుగులో వేరెవ‌రి ముందు నన్ను అవమానపరచకూడదు. పెళ్లయిన తర్వాత ఎలాంటి మత్తు పదార్థాలు, జూదం ఆడకూడదు. దీనికి మీరు అంగీకరిస్తే తదుపరి అడుగు మీతోనే వేస్తానని వ‌ధువుకు వ‌రుడు ప్ర‌మాణం చేస్తాడు. జీవితాంతం నీ తల్లిదండ్రులకు సేవ చేస్తాను. మీ ఇంటికి వచ్చిన అతిథులందరినీ నేను గౌరవిస్తాను. వారికి సేవ చేయ‌డంలో ఎలాంటి లోపం జ‌ర‌గ‌నివ్వను. నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటానని వ‌ధువు వ‌రుడికి ప్ర‌మాణం చేస్తుంది.

7. ఏడవ అడుగు..

ఇది వివాహానికి సంబంధించిన ఏడవది, చివరి ప్ర‌మాణం. ఈ వివాహం తర్వాత మీరు ప్రపంచంలోని ఇతర పురుషులందరినీ తండ్రిగా, సోదరులుగా చూడాల‌ని వ‌ధువును కోర‌తాడు. అంటే నా స్థానంలో నువ్వు నన్ను తప్ప మరే మనిషిని చూడకూడదు. మన మధ్య బంధంలో మరెవరికీ భాగస్వామ్యం ఉండకూడదు. మీరు దీనికి అంగీకరిస్తేనే మీతో ఈ చివరి అడుగు వేస్తాన‌ని వ‌రుడు వ‌ధువుకు చెబుతాడు. ఈ సంద‌ర్భంగా వధువు తాను ఎల్లప్పుడూ మీతో ఉంటానని ధర్మం, అర్థ, కర్మ విషయాలలో మీ ఆదేశాలను పాటిస్తానని వరుడికి ప్ర‌మాణం చేస్తుంది.

Also Read:  Muggu: ఇంటి ముందు ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా.. అయితే ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే?