Temple : దర్శనం తర్వాత ఆలయంలో గుడి మెట్లపై కూర్చోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మీకు తెలుసా?

గుడికి వెళ్ళగానే గంట కొట్టడం తీర్థప్రసాదాలు తీసుకోవడం ఆలయ చుట్టూ ప్రదర్శనలు చేయడం, స్వామివారి దర్శనం అనంతరం గుడిలో (Temple) కాసేపు కూర్చోవడం.

Published By: HashtagU Telugu Desk
Do You Know The Meaning Behind Sitting On The Steps Of The Temple After Darshan..

Do You Know The Meaning Behind Sitting On The Steps Of The Temple After Darshan..

Meaning behind Sitting on the Steps of the Temple after Darshanam : మామూలుగా మనం ఆలయానికి వెళ్లినప్పుడు చాలా విషయాలు మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. అనగా గుడికి వెళ్ళగానే గంట కొట్టడం తీర్థప్రసాదాలు తీసుకోవడం ఆలయ చుట్టూ ప్రదర్శనలు చేయడం, స్వామివారి దర్శనం అనంతరం గుడిలో (Temple) కాసేపు కూర్చోవడం. కానీ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తాం, వాటి వెనుక ఉన్న కారణం ఏమిటి? అన్నది చాలా మందికి తెలియదు. ఒకవేళ అడిగినా కూడా అది సాంప్రదాయం, ఆచారం పెద్దలు చెప్పారు అని చెబుతూ ఉంటారు. మరి దర్శనం తరువాత గుడి (Temple) మెట్లపై కూర్చోవడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఈ పురాతన సంప్రదాయం ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం రూపొందించారు. నిజానికి, ఆలయం మెట్ల‌ మీద నిశ్శబ్దంగా కూర్చుని, ఒక శ్లోకం చదవాలి. కానీ ఆ ప‌ద్ధ‌తిని, మంత్రాన్ని చాలామంది ప్రజలు మర్చిపోయారు. ద‌ర్శ‌నానంత‌రం గుడి మెట్ల‌పై కూర్చుని ఈ శ్లోకాన్ని ప‌ఠించాలి. అలా చేయ‌డం ద్వారా జీవితంలోని చాలా కలవరపరిచే కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానాలు పొందుతారు. ఇంతకీ ఆ శ్లోకం ఏమిటంటే.. అనాయాసేన మరణం, బినా దేన్యేన జీవనం, దేహంత్ తవ సానిధ్యం, దేహి మే పరమేశ్వరం.. దర్శనం కోసం గుడికి వెళ్లినప్పుడడు కళ్లు తెరిచి భగవంతుని దర్శనం చేసుకోవాలని పెద్ద‌లు చెబుతారు. కొంతమంది కళ్లు మూసుకుని నిలబడి భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తారు. పరమాత్ముని దర్శనానికి వచ్చిన మనం కళ్లు మూసుకోవడం ఎందుకు? కళ్లు తెరిచి భగవంతుని రూపాన్ని, నిజ స్వరూపాన్ని, దివ్యమంగ‌ళ విగ్ర‌హాన్ని చూడాలి.

మీ మ‌న‌సు అలౌలిక ఆనందంలో మునిగిపోయేలా, భ‌గ‌వంతుని దివ్య‌ మంగ‌ళ స్వరూపంతో మీ కళ్లలో నిండిపోయేలా ద‌ర్శ‌నం చేసుకోవాలి.. దర్శన అనంతరం గుడి మెట్ల మీద కూర్చున్నప్పుడు, మీరు కళ్లు మూసుకొని మీరు చూసిన భ‌గ‌వంతుని స్వ‌రూపాన్ని ధ్యానించాలి. కళ్లు మూసుకొని మ‌న‌సు లోపల ఉన్న ఆత్మను ధ్యానించాలి. ధ్యానంలో భగవంతుడు కనిపించకపోతే, ఆలయానికి తిరిగి వెళ్లి మళ్లీ దర్శనం చేసుకోవడం మంచిది. అయితే దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, మనం దర్శనం చేసుకున్న‌ప్పుడు, మన ప్రాపంచిక అవసరాలు, కోరికలను నెరవేర్చగ‌లిగే శ‌క్తిసామ‌ర్థ్యాలున్న‌ సర్వశక్తిమంతుడిని చూడడానికి బదులుగా మన ఆత్మలో ఆయ‌న రూపం ముద్ర‌ప‌డేలా చేయాలి. ఆలయం మెట్ల‌పై కూర్చొని, సర్వశక్తిమంతుడితో మ‌న ద‌ర్శ‌నం స‌మ‌యంలో జ‌రిగిన అద్భుత దృశ్యం గురించి ఆలోచించడం అత్యంత అవ‌స‌ర‌మైన చ‌ర్య‌, దానిని సంప్ర‌దాయ‌ పద్ధతిలో చేయ‌డం తప్ప‌నిస‌రి.

Also Read:  Electric Car: ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇంజిన్ ఆయిల్‌ పోయవచ్చా.. ఇందన కారుకి దీనికి తేడా ఏంటో తెలుసా?

  Last Updated: 16 Dec 2023, 05:41 PM IST