Peacock Feathers: నెమ‌లి ఫించాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారా.. అయితే మీకు ఎన్ని లాభాలో తెలుసా..?

నెమలి భారతదేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు.

  • Written By:
  • Publish Date - October 10, 2022 / 06:30 AM IST

నెమలి భారతదేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగించేవాడు.

నెమ‌లి పురివిప్పి నాట్యం చేస్తుంటే చూసేందుకు ఎంతో మ‌నోహ‌రంగా ఉంటుంది. అస‌లు నెమలి అంద‌మే అందం. దాన్ని అలా ఎంతసేపైనా చూడాల‌నే ఎవ‌రికైనా అనిపిస్తుంది. మగ నెమల్లకు అందమైన‌ మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు ఫించం ఉంటుంది. మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి. ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులలో ఉండే ఫించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు. కానీ వీటికి ఒక కొప్పూంటుంది.

ఇక కొంద‌రైతే నెమ‌లి ఫించాల‌ను సేక‌రించి ఇంట్లో పెట్టుకుంటుంటారు. కొందరు వాటిని పుస్త‌కాల్లో దాచుకుంటారు. అది వారికి స‌ర‌దా అనిపిస్తుంది. అయితే స‌ర‌దా కోస‌మే కాదు. నిజంగా నెమ‌లి ఫించాన్ని దాచుకోవ‌డం వ‌ల్ల వాస్తు ప్ర‌కారం మ‌న‌కు లాభాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఓసారి చూద్దాం..!

రాత్రిపూట నిద్రించేట‌ప్పుడు దిండు కింద నెమ‌లి ఫించాన్ని పెట్టుకుంటే ఆర్థిక‌, ఆరోగ్య స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌. పీడ‌క‌ల‌లు రాకుండా ఉంటాయ‌ట‌. ఇంట్లో బెడ్‌రూంలో తూర్పు లేదా ఈశాన్య మూల‌లో నెమ‌లి ఫించాన్ని పెట్టుకుంటే ఎప్ప‌టి నుంచో అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ట‌. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తార‌ట‌. అలాగే ఏవైనా ప‌నులు పెండింగ్‌లో ఉంటే త్వ‌ర‌గా పూర్తవుతాయ‌ట‌. చ‌దువుల్లో వెనుక‌బ‌డే విద్యార్థులు పుస్త‌కాల్లో నెమ‌లి ఫించాల‌ను పెట్టుకుంటే.. చ‌దువుల్లో బాగా రాణిస్తార‌ట‌. ఇంట్లో ఉన్న వినాయ‌కుడి విగ్ర‌హం లేదా చిత్ర‌ప‌టం ఎదురుగా నెమ‌లి ఫించం ఉంచితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాల‌న్నీ పోతాయ‌ట‌. న‌వ‌గ్ర‌హాల్లో ఏవైనా గ్ర‌హాల స‌మ‌స్య‌లు, దోషాల‌తో ఇబ్బందులు ప‌డే వారు నెమ‌లి ఫించంపై కొద్ది కొద్దిగా నీరు పోస్తూ.. 21 సార్లు ఆ గ్ర‌హానికి చెందిన మంత్రాల‌ను చ‌ద‌వాలి.ఆ త‌రువాత నెమ‌లి ఫించాన్ని పూజ‌గ‌దిలో ఉంచి మ‌రుస‌టి రోజు నీటిలో ముంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ్ర‌హ దోషాలు పోతాయ‌ట‌.