Ear Piercing : చెవిపోగులను మహిళలతో పాటు కొందరు పురుషులు కూడా ధరిస్తుంటారు. మహిళలు అలంకరణ కోసం, సంప్రదాయబద్ధంగా కనిపించడానికి చెవిపోగులను ధరిస్తుంటారు. మరి పురుషులు ఎందుకు వాటిని ధరిస్తారు ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. చాలామంది యువకులు ఇటీవలకాలంలో చెవులకు పోగులతో కనిపిస్తున్నారు. దాన్ని కూడా ఒక స్టైల్‌లా(Ear Piercing) వాడేస్తున్నారు. వాస్తవానికి చెవిపోగులను ధరించడం వెనుక కూడా ఒక సైన్సు ఉందని పండితులు చెబుతున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- ఒకప్పుడు ప్రాచీన రాజులు కూడా చెవిపోగులు ధరించేవారట. అప్పట్లో రాజ కుటుంబాల పురుషుల అలంకరణలో చెవిపోగులు కూడా భాగంగా ఉండేవట.
- మగవారికి కోపం ఎక్కువగా వస్తుంటుంది. చెవిలోని నరంలో పోగులు గుచ్చుకుంటే కోపం తగ్గుతుందని నిపుణులు చెబుతుంటారు.
- చెవులు కుట్టించుకున్న వారు ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తారని అంటారు.
- చెవి కుట్టించుకున్న అబ్బాయిలు త్వరగా పరిపక్వం చెందుతారని చెబుతుంటారు.
Also Read :Firing At Trump : ట్రంప్‌పై కాల్పులు.. షూటర్ గురించి ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..
- ఇతరులతో పోలిస్తే చెవి కుట్టించుకున్న వారు తమ జీవితాన్ని త్వరగా అర్థం చేసుకుని ముందుకు సాగుతారని అంటారు.
- చెవిలో బంగారం లేదా రాగిని ధరించడం వల్ల శరీరానికి సంబంధించి సహజ విద్యుత్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని నమ్ముతుంటారు.
- అలర్జీలు, మైగ్రేన్‌లను తగ్గించుకోవడానికి చెవులు కుట్టించుకోవడం మంచి ఉపాయమని అంటారు.
- చెవిపోగులు ధరించిన వ్యక్తుల తెలివితేటలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాలు చాలా మెరుగ్గా ఉంటాయని చెబుతారు.
- చెవిపోగులు ధరిస్తే నాడీ వ్యవస్థ శుద్ధి అవుతుందని విశ్వసిస్తారు. దీని ద్వారా మన మనస్సు నుంచి చెడు ఆలోచనలు తొలగిపోతాయని నమ్ముతారు.
-
మనిషి చెవులు ఎంత చిన్నగా ఉంటే అంత శక్తిమంతుడు అవుతాడని చెబుతారు. చిన్న చెవులు ఉన్న వ్యక్తులు చూడటానికి కాస్త బెరుకుగా కనిపిస్తారు. అయితే వారు ఇతరులకు బాగా మర్యాద ఇస్తారు. క్రమశిక్షణతో మసులుకుంటారు. ఈ వ్యక్తులు సాధారణంగా ఇతరులతో కలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది.
Also Read :Telangana Budget – 2024 : 25 లేదా 27న అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్.. కేటాయింపులపై అంచనాలివీ
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.