Site icon HashtagU Telugu

Pooja Tips : పూజలో ఈ ఏడు రకాల పత్రాలను తప్పకుండా ఉపయోగించాలని మీకు తెలుసా..?

Do You Know That These Seven Types Of Documents Must Be Used In Pooja..

Do You Know That These Seven Types Of Documents Must Be Used In Pooja..

Pooja Tips : హిందువులు ఎన్నో రకాల చెట్లను పూజిస్తూ ఉంటారు. వాటిలో భగవంతుడు కొలువై ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆకులను దైవ పూజలో (Pooja) కూడా ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఏడు రకాల పత్రాలను పూజలు (Pooja) తప్పకుండా ఉపయోగించాలి అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ పత్రాలు ఏవి? ఏ దేవుడి పూజలో (Pooja) ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

ఇందులో మొదటిది మామిడి ఆకు.. హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా గుమ్మానికి ఈ మామిడి ఆకులను తోరణంగా కడుతూ ఉంటారు. దీని ఆకులను పూజలో కలశం పైభాగంలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. హిందూ ధ‌ర్మం ప్రకారం, ప్రతికూలతను తొలగించడం ద్వారా సానుకూలతను వ్యాప్తి చేసే శక్తి మామిడి ఆకులకు ఉంది. అందువ‌ల్లే మంగళ కార్య‌క్ర‌మాల్లో వీటిని ఉపయోగిస్తారు. మామిడి ఆకులోని శుభశక్తి ఆ శుభ కార్యంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ ఉపశమనాన్ని ఇస్తుంది. రెండవ ఆకు తులసి ఆకు.. తులసి ఆకులను తరచుగా పూజలో ఉపయోగిస్తారు. వైష్ణవ‌ ఆరాధనలో, అంటే విష్ణువును ఆరాధించేవారికి, ప్రత్యేకంగా విష్ణువుకు నైవేద్యాలు సమర్పించడానికి తుల‌సిని ఉపయోగిస్తారు. తులసిని విష్ణు ప్రియ అని అంటారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో దుఃఖం, దురదృష్టాలు ఉండవని నమ్మకం. హిందూ మతంలో, ఇల్లు లేదా స్థలాన్ని శుద్ధి చేయడానికి తులసిని నీటిలో క‌లిపి చల్లుతారు.

అలాగే వెంకటేశ్వర స్వామి, కృష్ణుడి పూజలో కూడా తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. మూడవ ఆకు తమలపాకు.. హిందువులు ఎటువంటి శుభకార్యం మొదలుపెట్టిన కూడా ముందుగా తాము దేవుడికి తాంబూలం పెట్టడం అన్నది తప్పనిసరి. అందుకోసం తమలపాకులను ఉపయోగిస్తూ ఉంటారు. తమలపాకు బుధ గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే మరొక ఆకు మారేడు ఆకు దీనినే బిల్వపత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మారేడు ఆకులను ఎక్కువగా పరమేశ్వరుడు అలాగే విఘ్నేశ్వరుడి పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. జమ్మి చెట్టు.. ఈ చెట్టు ఆకులను కూడా దేవుడికి సమర్పిస్తూ ఉంటారు.

జిమ్మీ ఆకులను శివుడితోపాటు విగ్నేశ్వరుడికి, శనికి కూడా ఈ పత్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలాగే హిందువులు అరటి ఆకులు కూడా విష్ణుమూర్తి పూజలో ఉపయోగిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో, ఈ ఆకును చాలా పవిత్రంగా భావిస్తారు. అర‌టి ఆకులో భ‌గ‌వంతునికి నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, అర‌టి మొక్కను పూజించడం ద్వారా బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఇక చివరిగా జిల్లేడు ఆకు విషయానికి వస్తే.. జిల్లేడు ఆకును శివపూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. జిల్లేడు ఆకుపై ఓం అని రాసి శివలింగానికి సమర్పిస్తే, పరమేశ్వరుడి ఆశీస్సులు త్వరలోనే లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

Also Read:  Bellam Ariselu: బెల్లం అరిసెలు ఇలా చేశారంటే చాలు.. ఒక్కటి కూడా మిగలదు?