భగవంతుడి ప్రార్థనలో పువ్వులు ప్రధానమైనవి. భక్తులు పలు రకాల పువ్వులను సేకరించి పూజల సమర్పిస్తారు. కొంతమంది భక్తులు దేవుడికి సమర్పించడం కోసం ఇంట్లో రకరకాల పువ్వులను మొక్కలను పెంచుతుంటారు. అందుకు అవకాశం లేని పువ్వులను కొనేసి వాటితోనే దేవతార్చన చేస్తుంటారు. అయితే దేవుడికి సమర్పించే పువ్వుల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
ఎలాంటి పువ్వులు పూజకు వాడకూడదంటే…వాసనలేని పువ్వులు…ఘాటైన వాసన ఉన్న పువ్వులు…ముళ్లున్న పువ్వులు, వాడిపోయిన పువ్వులు…రెక్కలు తెగినవి…పూజకు వాడకూడదు. అలాగే పరిశుభ్రమైన..పవిత్రమైన ప్రదేశాల్లో నుంచి తీసుకువచ్చిన పువ్వులను మాత్రమే పూజలో వాడాలి. నేలపై పడిన పువ్వులు, పురుగులు పట్టిన పువ్వులు…పూర్తిగా వికసించని పువ్వులు, ఎడమ చేతితో కోసిన పువ్వులను దేవుడి పూజకు పనికిరావని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరిశుభ్రమైన, పవిత్రమైన ప్రదేశంలో చెట్టుకు పూసిన సువాసన కలిగిన తాజా పువ్వులను మాత్రమే దేవుడికి భక్తిశ్రద్ధలతో సమర్పించాలి. ఈ విధంగా చేస్తే దేవుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని మహర్షుల మాట.