Site icon HashtagU Telugu

Temple: గుడికి వెళుతున్నారా.. గుడిలో ఇలా చేస్తే మంచి జరుగుతుందని మీకు తెలుసా?

Temple Visit

Temple Visit

మామూలుగా మనం తరచుగా ఆలయాలకు వెళుతూ ఉంటాం. కొందరు ప్రతిరోజు ఆలయాలకు వెళ్తే మరికొందరు వారంలో ప్రత్యేకమైన రోజుల్లో అలాగే పండుగ సందర్భాలలో ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఆలయాలకు వెళ్లడం వల్ల మనసు ప్రశాంతంగా అనిపించడంతోపాటు మనసుకు ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఆలయానికి వెళ్లడం మంచిదే కానీ ఆలయానికి వెళ్ళిన తర్వాత చాలామందికి తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు.

అలాగే ఆలయానికి వెళ్ళిన తర్వాత కొన్ని రకాల పనులు చేస్తే మంచి జరుగుతుందన్న విషయం చాలా మందికి తెలియదు. మరి ఆలయానికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం… దేవాలయంలోకి వెళ్లేటప్పుడు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని తలపై కొన్ని నీళ్లు చల్లుకొని ఆ తర్వాత దేవాలయం లోపలికి వెళ్లాలట. అదేవిధంగా ఎటువంటి దేవాలయానికి వెళ్ళినా కూడా ముందుగా అక్కడ ధ్వజ స్తంభాన్ని దర్శించుకోవాలని పండితులు. అలాగే చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు చేసే సమయంలో దేవాలయం వెనుక భాగాన్ని తాకుతూ ప్రదక్షిణలు చేస్తారు.

కానీ అలా అసలు చేయకూడదని చెబుతున్నారు. ఎందుకంటే దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట.. కాబట్టి అక్కడ తాకకూడదని చెబుతున్నారు. అదేవిధంగా దేవాలయంలో పూజ పూర్తి అయిన తర్వాత తీర్థం అలాగే శతగోపనం తప్పకుండా తీసుకోవాలని చెబుతున్నారు. పొరపాటున కూడా వీటిని మర్చిపోకూడదని చెబుతున్నారు. శతగోపనం పైన విష్ణువు పాదాలు ఉంటాయి. అదేవిధంగా దేవాలయంలో దైవా దర్శనం అనంతరం కొద్దిసేపు గుడిలో ఒకచోట కూర్చుని తర్వాత వెళ్లాలని చెబుతున్నారు. అలా గుడిలో ఒకచోట కూర్చున్నప్పుడు దైవ స్వరూపాన్ని మనసులో స్మరించుకోవాలని చెబుతున్నారు.