Vastu : పెళ్లయిన స్త్రీలు ఆ దిక్కున పొరపాటున కూడా నిద్రించకూడదు..ఎందుకో తెలుసా?

వాస్తుశాస్రంలో ఎన్నోవిషయాలు పేర్కొన్నారు. ఇంట్లో వస్తువులు,దిశల ప్రాముఖ్యత గురించి వివరంగా ఉంటుంది. ముఖ్యంగా వాస్తు అనేది ప్రతిఒక్కరి జీవితంతో ముడిపడి ఉంటుంది.

  • Written By:
  • Updated On - September 22, 2022 / 08:12 AM IST

వాస్తు సరిగ్గా ఉంటేనే అంతా ఆనందం. లేదంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. నిద్రించే సమయంలోనూ వాస్తును పాటించాల్సిందే. వాస్తు ప్రకారం కొన్ని దిశలలో నిద్రించడం వల్ల దురదృష్టంతోపాటు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్న ఏయే దిశల్లో నిద్రపోకూడదో తెలుసుకుందాం.

దక్షిణం వైపు:
పడుకునేటప్పుడు దక్షిణం దిశవైపు పాదాలు పెట్టకూడదు. వాస్తుప్రకారం ఇలా చేయడం చాలా తప్పు. ఇదియమరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో పాదాలు చాపి పడుకున్నట్లుయితే..యముడికి కోపం వస్తుందట. అంతేకాదు దీని ప్రభావం మన ఆరోగ్యం, వయస్సు రెండింటిపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్నవారు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దక్షిణ దిశలో తలపెట్టి పడుకోవడం మంచిది.

ఉత్తరం వైపు:
మీరు ఉత్తరంవైపు పాదాలు ఉంచి నిద్రిస్తే… ఈ తప్పును సరిదిద్దుకోండి. ఈ దిశ సంపదలకు అధిపతి అయిన కుబేరునికి చెందినది. ఈ దిశలో పాదాలు చాచి నిద్రించం ఉత్తర దిశలోని సానుకూల తరంగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ ఆర్థిక జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ దిశలో మీ పాదాలను ఉంచి నిద్రించడం వల్ల ఆదాయ వ్యయ సమతుల్యతకు భంగం వాటిల్లుతుంది.

పెళ్లికాని అమ్మాయి:
వాస్తు ప్రకారం పెళ్లికాని అమ్మాయిలు నైరుతి దిశలో పడుకోకూడదు. ఆడిపిల్లలు ఈ దిశలో నిద్రించడం మంచిది కాదు. అయితే పెళ్లయిన అమ్మాయిలు ఉత్తరం వైపు కాళ్లు పెట్టి నిద్రించడం మంచిది.

పెళ్లయిన స్త్రీలు ఆ దిక్కున పాదాలు పెట్టకూడదు :
పెళ్లయిన స్త్రీలు పడమటి కోణంలో పడుకోకూడదనే నమ్మకాలు ఉన్నాయి. ఉత్తరం, పశ్చిమ మధ్య ఉన్న ప్రదేశం కాబట్టి ఈ దిక్కున పడుకోవడం వల్ల స్త్రీలు కుటుంబంతో విడిపోయే ప్రమాదం ఉంటుంది.