దీపావళి (Diwali) రోజున పెరుగు (Curd)తో స్నానం చేయడం ఒక ప్రత్యేకమైన ఆచారం అని జ్యోతిష్య పండితులు (Astrologers) చెబుతున్నారు. దీని ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు గురించి పండితులు ఈ విధంగా వివరిస్తున్నారు:
పెరుగులో లక్ష్మీదేవి (Goddess Lakshmi) ఉనికిని గుర్తిస్తూ, దీపావళి రోజున పెరుగుతో స్నానం చేయడం అదృష్టానికి సంకేతంగా ఉంటుంది. దీని వెనుక పురాణ గాథ ప్రకారం.. దేవతలు మరియు దానవులు పాల సముద్రాన్ని చిలకగా, అక్కడి నుండి లక్ష్మీదేవి ఒక దీపం రూపంలో ఈ పవిత్ర దినాన, అంటే దీపావళి రోజున ఆవిర్భవించిందట. పాల సముద్రం అంటే పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తుల సమగ్రత. అందువల్ల, లక్ష్మీదేవి ఉన్న అనుభూతి కలిగించే పెరుగుతో స్నానం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు విశ్వసిస్తున్నారు.
స్నానం చేసే నీటిలో రెండు స్పూన్ల పెరుగును కలిపి, ఐదు నిమిషాల పాటు ఆ నీటిని అలాగే ఉంచి ఆ తర్వాత దానితో స్నానం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయనీ, ఆర్ధికంగా కలిసివస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
Read Also : Cyber Fraud : అధిక వడ్డీ పేరుతో ఏలూరులో ఘరానా మోసం..