Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?

భారతీయులు ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం చేస్తుంటారు. కూర్చునే దగ్గర నుంచి పడుకునే వరకు అన్నింటిని సంప్రదాయపద్దతి ప్రకారం చేస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Eating On Flooer

Eating On Flooer

భారతీయులు ప్రతిదీ ఓ పద్దతి ప్రకారం చేస్తుంటారు. కూర్చునే దగ్గర నుంచి పడుకునే వరకు అన్నింటిని సంప్రదాయపద్దతి ప్రకారం చేస్తుంటారు. భోజనం విషయానికిరియ బ్రాహ్మణం చెబుతోంది. రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా దక్కుతుందట.

ఇక భోజనం చేసేటప్పుడు తూర్పుదిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని తైత్తిరియా బ్రాహ్మణం వివరిస్తోంది. అంతేకాదు దక్షిణదిశగా తిరిగి భోజనం చేస్తే కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరంవైపు తిగిరి భోజనం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర, దక్షిణం వైపునకు కూర్చుని భోజనం చేయకూడదని పురాణాల్లో ఉంది. అందుకే ఎక్కువ మంది తూర్పు దిక్కున కూర్చోని భోజనం చేస్తుంటారు.

ఇక ఆకులు, ఇనుప పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు. డబ్బును ఆశించేవాడు మట్టి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగ, తామర ఆకుల్లో మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందు, తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. కానీ నియమాలను అనుసరించకుండా ఎలా పడితే అలా భోజనం చేస్తే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య, ఆర్థిక సమస్యలు రావొచ్చు. తినేటప్పుడు పద్దతిగా తింటే మంచిది.

  Last Updated: 07 Jul 2022, 05:39 AM IST