Vastu : లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే…కనకధార పూజ ఎలా చేయాలి..మంత్రం ఎలా జపించాలి.!!

కనకధార లక్ష్మీ దేవి రూపం. "కనక" అంటే "సంపద. " "ధార" అంటే "ప్రవాహం" కాబట్టి కనకధార అంటే సంపద యొక్క స్థిరమైన ప్రవాహం అని అర్ధం.

  • Written By:
  • Publish Date - September 18, 2022 / 07:00 AM IST

కనకధార లక్ష్మీ దేవి రూపం. “కనక” అంటే “సంపద. ” “ధార” అంటే “ప్రవాహం” కాబట్టి కనకధార అంటే సంపద యొక్క స్థిరమైన ప్రవాహం అని అర్ధం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం చేసే అనేక పూజలలో కనకధార పూజ ఒకటి. ఈ పూజలో లక్ష్మీదేవిని పూజిస్తారు. కనకధార వ్రతం ఎలా చేయాలి. ఎలాంటి మంత్రం జపించాలో తెలుసుకుందాం.

1. కనకధార పూజ నేపథ్యం
కనకధార పూజ మూలం పురాతన కాలం నాటిది. కనక ధార స్తోత్రం ఆదిశంకరాచార్యులచే రచించారు. అతను ఒకప్పుడు భిక్షాటన చేసి దానం చేయడానికి కూడా స్తోమత లేని ఒక పేదరాలిని కలిసాడు. తన దగ్గరం ఏం లేకపోవడంతో జామకాయను దానం చేసింది. ఆ మహిళ దాతృత్వాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆదిశంకరాచార్యులు ఆ మహిళలకు సంపదను ప్రసాదించడానికి లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి కనకధార స్తోత్రాన్ని వినిపించాడు.

శంకరాచార్యుల భక్తికి ముగ్ధుడై, లక్ష్మీదేవి తన పూర్వ జన్మలో చేసిన పాపపు పనుల కారణంగా ఈ జన్మలో భిక్షకురాలిగా తిరుగుతున్నందున ఆమెకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. స్త్రీ దాతృత్వపు చర్య ఆమె గతంలో చేసిన పాపాలను పోగొట్టాలి. అప్పుడే తన పేదరికం పోతుందని చెప్పింది. కానీ శంకరాచార్యులు ఆ మహిళ గురించి వివరించినప్పుడు, లక్ష్మీదేవి మహిళ చేసిన పనికి సంతోషించి ఆమెకు సంపదను వరప్రసాదంగా ఇస్తుంది. ఈ పూజ ఎవరి జాతకంలో అయితే పేదరికంతో బాధపడుతారో వారు ఈ పూజను చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.

2. కనకధార పూజ వల్ల కలిగే లాభాలు:
– ఆర్థికంగా నష్టపోయే వారికి ఈ పూజ ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఆ నష్టాల నుంచి బయటపడటానికి ఈ పూజ చేయాలి.
– ఖర్చును తగ్గిస్తుంది. డబ్బు సమస్యను ఎదుర్కొంటున్న వారు ఈ పూజ నుండి ప్రయోజనం పొందుతారు.
– ఒక వ్యక్తిని అప్పుల నుండి విముక్తి చేయడానికి ఈ పూజ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
– వ్యాపారం, స్టాక్ మార్కెట్‌లో పనిచేసే వ్యక్తులు ఈ పూజ ద్వారా తమ రంగంలో భారీ లాభాలను, విజయాన్నిపొందుతారు.

3. కనకధార మంత్రం:
“ఓం వం శ్రీం వాం అం హ్రీం శ్రీం క్లీం కనకధారాయై నమః”

4. కనకధార పూజ, హోమం లేదా మంత్రంలో పాటించాల్సిన నియమాలు:
– పూజా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు.
– హోమం లేదా పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకూడదు.
– పూజలో పరిశుభ్రత ముఖ్యం, శుభ్రమైన దుస్తులు ధరించాలి.- కేవలం ఆరాధనపై మాత్రమే మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నించాలి.

కనకధారా స్తోత్ర పారాయణం, కనకధార పూజ, హోమం చేయడం వల్ల అపారమైన సంపద మనకు లభిస్తుంది. దీనికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.