Srikalahasti: శ్రీకాళహస్తికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా

Srikalahasti: పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది. ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు. కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు. అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే […]

Published By: HashtagU Telugu Desk
Srikalahasti Temple

Srikalahasti Temple

Srikalahasti: పంచభూత లింగాలలో వాయు లింగం శ్రీ కాళహస్తి లో ఉన్నది. ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయును కంటికి కనిపించదు. కనుక వాయువుకు సంకేంతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలు లేదు. అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి ( ఆక్సిజన్ ) అందక శివ జ్యోతి ఆరిపోతుందని చెప్పారు. అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేసారు.

24 గంటలు గడచినా గర్భ గుడిలోని శివ జ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది. అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొకటిగా చచ్చుబడిపోతు వొంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది.అప్పుడు స్వామి వారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యెక పూజలు చేయమని అర్చకులకు మనవి చేసాడు.తనని ఆలయంలోకి తీసుకెళ్ళమని చెప్పి అక్కడ స్వామి వారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది.
అంతే కాకుండా ఈ స్వామి వారిని ఒక శ్రీ – సాలెపురుగు , కాళము – ఒక పాము , హస్తి – ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది.

  Last Updated: 19 Mar 2024, 06:10 PM IST