Site icon HashtagU Telugu

Rama Ruled Ayodhya : శ్రీరాముడు అయోధ్యను ఎన్ని ఏళ్లు పాలించాడో తెలుసా..?

Vontimitta Sri Rama Kalyanam

Vontimitta Sri Rama Kalyanam

శ్రీరాముడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందరికో దర్శనం…మరికొందరికో మార్గదర్శకం. అందుకే తెలుగు ప్రజలు ఎక్కువగా శ్రీరాముడిని కొలుస్తుంటారు. రామాయణం గురించి తెలుగు ప్రజలకు బాగా తెలుసు. మహావిష్ణువు అవతారల్లో రాముడి అవతారం ఒకటి. ఏక పత్నివతుడు. కావ్యేతి హాస పురాణాల్లో అతిశయోకకులు ఉండటం అనేది సత్యం. వాటన్నింటిని యథాతథంగా స్వీకరించడమే కర్తవ్యం. దానిలో సత్యసత్యాలను నిర్ణయించడం అనేది సాధ్యం కాని పని.

పురాణాలు, యుగాల్ని అనుసరించి ఆయు:ప్రమాణం, శరీర ప్రమాణం నిర్ణయించింది. వాటి ప్రకారం మనమే అర్థం చేసుకోవాలి. కావ్యేతిహాస పురాణాల్లో యుద్ధంలో పాల్గొన్న సైనికలు సంఖ్యకు, తుదకు మరణించిన వారి సంఖ్యకు ఏకత్వం కుదరదు. ఇక రామాయణం విషయం చూద్దాం. సీతా పరిత్యాగ అనంతరం రాముడు పరిపాలిస్తున్నప్పుడు..తన కొలువు కూటానికి వెలుపల లక్ష్మణుడిని కాపలా ఉంచాడు. ఒకనాడు రాముడు కొలువులో ఉండగా…యమ ధర్మరాజు మహర్షి వేషంలో వచ్చి ఏకాంతంగా మాట్లాడాలని కోరాడు.

అందరూ వెళ్ళిన తర్వాత అతడు అసలు విషయం వివరించాడు. నేను యముడిని. నీవు శ్రీ మహావిష్ణుమూర్తివి. నీవు భూలోకంలో అవతరించి 11వేల సంవత్సరాలు అయ్యింది. రావణాది దుష్ట సంహారం పూర్తయ్యింది. కాబటి అవతార పరిసమాప్తి చేయాల్సింది. అని వివరిస్తుండగా లక్ష్మణుడు లోపలికి వచ్చాుడ. యముడు అదృశ్యం అవుతాడు. యముడు అన్న మాట ప్రకారం తమ్ముని శిరశ్చేదం చేయలేక రాజ్య బహిష్క్రుతుని చేశాడు. లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి అవతారం చాలిస్తాడు. అలా చూసుకుంటే రాముడు 10వేలకు పైగా ఏళ్లుగా అయోధ్యను పాలించాడు.