Site icon HashtagU Telugu

Donate: యమలోకానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ దానాలు చేయాల్సిందే?

Donate

Donate

సాధారణంగా సమయం సందర్భానుసారంలో మనం చెడు పనులు చేసినప్పుడు నరకానికి పోతావు, మంచి పనులు చేసినప్పుడు స్వర్గానికి పోతావు అని అంటూ ఉంటారు. మనం చేసే మంచి చెడులను బట్టి స్వర్గం నరకంలోకి వెళ్తారని అంటూ ఉంటారు. అందుకే తరచూ మంచి పనులు చేస్తూ మనకున్న దానిలో దానధర్మాలు చేయాలని చెబుతూ ఉంటారు. సనాతన సంప్రదాయంలో అష్ట మహాదానాలకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత వుంది. అవేంటంటే.. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, భూమి, ఆవులు, అలాగే ఎనిమిదవ దానంగా ఏడు ధాన్యాలు కలపి అనగా గోధుమలు, కందులు, పెసలు, శనగలు, బొబ్బర్లు, మినుములు, ఉలవలు కలిపి దానం చేయాలి.

మాములుగా నువ్వులు మూడు రకాలు ఉంటాయి. వీటిలో ఏది ఇచ్చినా కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనివారం నువ్వులు దానం చేయడం ద్వారా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. శనివారం శనీశ్వరుని ముందు ఆవు నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శుభప్రదం. ఈ రోజున నల్లని వస్త్రాలను దానం చేసి నల్లటి శునకానికి ఆహారం అందించడం వల్ల శని బాధలు తొలగిపోతాయి. అలాగే ఇనుమును దానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్లకుండా తప్పించుకోవచ్చట. యముడు ఇనుముతో చేసిన ఆయుధాలు ధరించి ఉంటాడు. దీంతో ఇనుము దానం చేసిన వారు యమలోకానికి వెళ్లరని చెప్తారు. భూమిని దానం చేయడం ద్వారా సమస్త భూతాలు సంతృప్తి చెందుతాయి.

సువర్ణ దానం బ్రహ్మ, దేవతలు, మునీశ్వరులు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు. అలాగే పత్తిని దానం చేయడం ద్వారా యమ భటుల భ‌యం ఉండ‌దు. ఉప్పు దానం చేస్తే యమధర్మరాజు అనుగ్రహిస్తాడు. గోదానంతో వైతరిణి నదిని దాటిపోవచ్చు. అంటే సకల దేవతలు కొలువైన ఆవుని దానం చేయడం ద్వారా స్వర్గలోకం ఎంట్రీ ఖాయం అన్నమాట. ఎనిమిదో దానంలోని ఏడు ధాన్యాలను కలపి దానం చేయడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోవడమే కాదు, యమ బాధలుండవని పండితులు చెబుతారు.

Exit mobile version