Site icon HashtagU Telugu

Spirtual: మరణించిన వారి ఫోటోలను ఇంట్లో ఈ విధంగా పెడుతున్నారా.. అరిష్టం కలగడం ఖాయం!

Photos 1696949355

Photos 1696949355

మామూలుగా మనం పెద్దలు అలాగే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి ఫోటోలను పెద్ద పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంట్లో కొంతమంది పూజ స్థలంలో కూడా పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు వాస్తు నియమాలు తెలియకుండా ఏ గోడకు పడితే ఆ గోడకు చనిపోయిన వారి ఫోటోలను తగిలిస్తూ ఉంటారు. అయితే చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లో అమర్చుకునే ముందు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎప్పుడు కూడా మరణించిన వారి ఫోటోలను ఇంట్లో గోడలకు వేలాడదీయకూడదట. ఇంట్లో ఏదైనా ఒక దిశలో చెక్క బల్లపై వారి ఫోటోలను పెట్టుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పెట్టడం, వాడికి పూజలు చేయడం లాంటివి చేయకూడదట. ఆ విధంగా దేవుడి గదిలో పెట్టిన వాటికి పూజలు చేసిన ఇంట్లో కలహాలు మొదలవుతాయని చెబుతున్నారు. మరణించిన వారి ఫోటోల పక్కన బతికున్న వారి ఫోటోలను పెట్టడం అంత మంచిది కాదట.

ఆ విధంగా పెడితే బతికున్న వారికి ఆయుష్షు తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. చనిపోయిన వారి ఫోటోలను ఇంట్లోకి రాగానే కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోకూడదట. ఈ విధంగా పెడితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం వైపున పెట్టడం ఎంతో మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

Exit mobile version