Site icon HashtagU Telugu

Camphor: ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా.. అయితే కర్పూరంతో ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Camphor

Camphor

భారతీయులు వాస్తు శాస్త్రాన్ని చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో కూడా వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఇల్లు కట్టించి ఇంట్లోని వస్తువులు అమరిక వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఇంటిని నిర్మించేటప్పుడు అవగాహన లోపం కారణంగా కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ పొరపాట్లు మనం ఎదుర్కొనే మానసిక ఆర్థిక సమస్యలకు కారణం కావచ్చు అని చెబుతున్నారు. వాస్తు దోషం ఏర్పడి కుటుంబంలో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి.

అయితే ఇలా ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగించడానికి కర్పూరం ఎంతో బాగా ఉపయోగపడుతుందని, కర్పూరంతో ఇప్పుడు చెప్పినట్టు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. మరి వాస్తు దోషాలు తొలగిపోవడానికి కర్పూరం తో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇంట్లో ఉన్న గదితో పాటు ఇంటి బయట స్థలం కూడా వాస్తు ప్రకారం ఉండాలట. లేదంటే వాస్తు దోషం వల్ల కుటుంబ సభ్యులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా వాస్తు దోషం వల్ల ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కర్పూరంతో చేసుకునే నివారణ వల్ల మంచి జరుగుతుందట.

వాస్తు దోషాల వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం మంగళవారం రోజున ఒక గిన్నెలో తొమ్మిది లవంగాలు తీసుకుని అందులో రెండు కర్పూర బిల్లలు ఉంచి పూజ చేసే సమయంలో దేవుడు ముందు ఉంచాలట. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్లి మన కోరిక మనసులో అనుకోని కర్పూరం వెలిగించి వాటిని కాల్చి బూడిద చేయాలని ఈ విధంగా ఆ తొమ్మిది మంగళవారాల పాటు చేస్తే ఆర్థిక సమస్యలు క్రమంగా దూరం అవుతాయి అని చెబుతున్నారు. అలాగే ఎవరికైనా ఇచ్చిన డబ్బు సకాలంలో ఇవ్వకుండా పీడీస్తుంటే, శుక్రవారం పూట, ఇళ్ళు వాకిలి శుభ్రం చేసుకొని లక్ష్మిదేవిని పూజించాలట. ఆ తర్వాత ఒక గిన్నెలో నాలుగు కర్పూరం బిళ్ళలు,మూడు లవంగాలు, 9 ఎర్రటి పూలను ఉంచాలట. ఇలా చేయటం వల్ల వాస్తు దోషాలు తొలగి, సకాలంలో చేతికి అందాల్సిన డబ్బు వస్తుందని చెబుతున్నారు.