Plants: ఇంటి ఆవరణలో అలాంటి మొక్కలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త?

చాలామందికి మొక్కలు అంటే పిచ్చి ప్రాణం. అందుకే ఇంటి లోపల ఇంటి బయట అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎక్కువగా పూల మొక్కలు ప

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 08:50 PM IST

చాలామందికి మొక్కలు అంటే పిచ్చి ప్రాణం. అందుకే ఇంటి లోపల ఇంటి బయట అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఎక్కువగా పూల మొక్కలు పండ్ల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే వాస్తు ప్రకారంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదు. చేయడం వల్ల ఆర్థికంగా నష్టాలు రావడంతో పాటు వాస్తు దోషాలు కూడా కలుగుతాయి. చెట్లు ఉండడం మంచిదే కానీ కొన్ని రకాల మొక్కలు అసలు ఉండకూడదు. ఎందుకంటే వాటివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించడమే కాకుండా ఏపని తలపెట్టినా మధ్యలోనే ఆగిపోతుంది.

అందుకే మీరు ఇష్టంగా పెంచుకునే మొక్కలైనప్పటికీ కొన్నింటిని ఇంటి ఆవరణలో ఉంచకపోవడమే మంచిది.మరి ఇంట్లో మొక్కలను పెంచకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాక్టస్‌ మొక్కలుగా పిలిచే ఎడారి మొక్కలు ముళ్ళతో ఉంటాయి. నాగజెముడు, బ్రహ్మజెముడు జాతికి చెందినవి. సహజంగా గుచ్చుకుంటూ ఉంటాయి. అందుకే ఇవి ఇళ్ల దగ్గర ఉండకూడదు అంటారు. ముళ్లుండే మొక్కలు ఇంట్లో ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్టే అంటారు. అందుకే ఇంటిబయట తోటలో పెట్టొచ్చు కానీ ఇంట్లో కుండీల్లో పెట్టరాదని చెబుతారు.

వాస్తవానికి ముళ్లుండే గులాబీ మొక్క కూడా ఈకోవకు చెందినదే అంటారు వాస్తు నిపుణులు. అందుకే గులాబీ మొక్క కూడా ఇంటి బయటే ఉండాలి. అలాగే బోన్సాయ్ మొక్కలు చూడటానికి అందంగా ఉంటాయి. అందుకే ఇంట్లో పెంచుకునేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ వాటిని కూడా ఇంట్లో పెంచుకోవడం అస్సలు మంచికాదు. ఇవి కూడా గార్డెన్ కి మాత్రమే పరిమితం చేయాలి. నిత్యం ఇంట్లో ఇవి కనిపిస్తే తలపెట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి.
చింత చెట్లను చాలా మంది ఇంటి గార్డెన్ లలో పెంచుకుంటూ ఉంటారు. కానీచింత చెట్లు ఇంటి గార్డెన్లో కాకుండా ఇంటి ఆవరణకు కాస్త దూరంగా ఉండవచ్చు.

చింత చెట్టు ఇంటి ఆవరణలో, గార్డెన్లో ఉంటే దరిద్రం వెంటాడుతుంది. అలాగే ఇంట్లో కుండీల్లోనో, గార్డెన్ లోనో ఉన్న చాలా మొక్కల్లో కొన్ని ఎండిపోయి ఉంటాయి. పోతోపోనీలే అని వాటిని వదిలేస్తుంటారు కొందరు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎండిన మొక్కలు, చనిపోయిన మొక్కలు ఉంచరాదు. వాటిని అలాగే ఉంచితే దురదృష్టం పట్టిపీడుస్తుంది. చాలామంది పూజకు పత్తి అవసరం అని పత్తి మొక్కలను కూడా ఇంటి ఆవరణలో పెంచుకుంటూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు.