Basil: ఇంట్లో తులసి చుట్టూ ఈ మొక్కలు ఉన్నాయా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే?

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. హిందువుల ఇండ్లలో తులసి

  • Written By:
  • Updated On - May 2, 2023 / 12:09 PM IST

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను దేవతగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. హిందువుల ఇండ్లలో తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర తప్పనిసరిగా ఉంటుంది. తులసి మొక్కలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారు.. కాబట్టి తులసి మొక్కను పూజించడం ద్వారా తులసి దేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది. వాస్తు శాస్త్రంలో ఇంటి బయట తులసి మొక్కను చూసి ఆ ఇంట్లోనే పరిస్థితులను కూడా చెప్పవచ్చు అన్న విషయాన్ని తెలియజేశారు. అయితే తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోవడం పూజించడంతోపాటుగా కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల తులసి దేవి అనుగ్రహం లభించకపోగా కీడు హాని జరిగి సమస్యలు ఎదురవుతాయి. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి మొక్కను ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి. తులసి మొక్కను తప్పుడు దిశలో నాటడం వల్ల ఇంటి అంతటా ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. కాబట్టి తులసి మొక్కను నాటేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవాలి. అందువల్ల భౌతికంగా, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. సహజంగానే, గృహిణులు తడి జుట్టుతో తలస్నానం చేసిన తర్వాత చెట్టుకు నీటిని పోస్తుంటారు. ఇది తప్పు.

ఎందుకంటె తులసిని విష్ణువు ప్రియమైన మొక్కగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వెంట్రుకలను ఆరబెట్టి, కట్టిన తర్వాత మాత్రమే తులసికి నీరు సమర్పించాలి. అలాగే తులసి మొక్క చుట్టూ పదార్థాలు, చెప్పులు, చీపుర్లు లేదా చెత్తను ఉంచవద్దు. గేటు బయట, అందరూ రాకపోకలు చేసే అతిదగ్గర తులసి మొక్కలు నాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాదు తులసిపై మురికి నీరు పడకుండా చూసుకోవాలి. తులసి మొక్క నాటిన కుండీలో వేరే మొక్కను నాటకూడదు. తులసి చుట్టూ ముళ్ల చెట్లను నాటకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో అనర్థాలు పెరిగి తులసి పూజ చేసిన సరైన ఫలం లభించదు. పాలలో నీళ్లు కలిపి తులసికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల తులసి పచ్చగా ఉంటుంది, వేగంగా పెరుగుతుంది. ఆదివారం నాడు తులసికి నీరు సమర్పించకూడదు. తరచుగా సాయంత్రం తులసి కింద దీపం వెలిగించాలి. కానీ దీపం వెలిగించిన తర్వాత, అది ఆరిపోయినప్పుడు, తులసి మొక్క నుండి దానిని తొలగించడానికి జాగ్రత్త తీసుకోవాలి.