Vastu : మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే నవరాత్రులు మొదలయ్యే లోపు తీసేయండి..లేదంటే ?

ఈ ఏడాది నవరాత్రులు 26 సెప్టెంబర్ నుంచి 05 అక్టోబర్ వరకు జరగుబోతున్నాయి. నవరాత్రుల్లో తొమ్మిదిరూపాల్లో అమ్మవారిని కొలుస్తారు.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 06:00 AM IST

ఈ ఏడాది నవరాత్రులు 26 సెప్టెంబర్ నుంచి 05 అక్టోబర్ వరకు జరగుబోతున్నాయి. నవరాత్రుల్లో తొమ్మిదిరూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. అయితే చాలామంది తమ ఇళ్లలో కలశాన్ని ఏర్పాటు చేసి తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవరాత్రులు ప్రారంభానికి ముందే ఇంటిని శుభ్రం చేస్తారు. ఇంట్లో ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా పరిశుభ్రం చేస్తారు. ఇలా చేసి అమ్మవారిని పూజిస్తేనే శుభఫలితాలు పొందుతారు. అయితే నవరాత్రి మొదలయ్యే ముందు కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే తీసివేయ్యండి. ఎందుకంటే ఈ వస్తువులు ఉంటే అశుభంగా భావిస్తుంటారు.

1. వెల్లుల్లి-ఉల్లిపాయ:
నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిదిరోజులుపాటు ఇంట్లో కొలువై ఉంటుంది. అమ్మవారికి ఉపవాసం ఉంటూ ప్రత్యేక పూజలు నిర్వహించేవారు ఇంట్లో వెల్లుల్లి,ఉల్లిపాయలు, గుడ్లు, మాంసం, చేపలు, ఆల్కహాల్ ఇలాంటి వస్తువులు ఉంటే వెంటనే తీసివేయండి. ఎందుకంటే ఈ వస్తువులు ఇంట్లో ఉంచుకుని పూజలు నిర్వహిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.
2. పాత చెప్పులు:
నవరాత్రుల్లో ఇంట్లో పాతచెప్పులు కానీ పాతబట్టలు కానీ ఉంటే తీసివేయండి. ఇవేకాదు పగిలిన గాజు పాత్రలు లేదా పగిలిన పాత్రలు ఉంటే వెంటనే తీసివేయండి. ఇంట్లో ఎలాంటి చెత్తచెదారం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. లేదంటే మనమే స్వయంగా నెగెటివ్ ఎనర్జీని కలిగించినట్లవుతాం.

3. విరిగిన విగ్రహాలు:
చిరిగిపోయిన దేవుళ్ల ఫొటోలు, లేదా విగ్రహాలు ఉంటే వాటిని తీసివేయండి. అలాంటివి పూజగదిలో ఉంచకూడదు. నవరాత్రులకు శుభ్రం చేసే సమయంలో వాటిని నదిలో కానీ చెరువులోకానీ నిమజ్జనం చేయండి. పూజగదిలో ఉంచిన ఇలాంటి విగ్రహాలు మన దురదృష్టానికి కారణం అవుతాయి.

4. ఆగిపోయిన గడియారం:
ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటు…దానిని తీసివేయండి. ఆగిపోయిన గడియారాలు అశుభానికి సంకేతంగా భావిస్తారు. ఇది మన పురోగతికి ఆటంకం కలిగించడమే కాదు…మనకు చెడు సమాయాన్ని తెస్తుంది.

5. ఆహారం;
వంటగదిలో చెడు ఊరగాయలు ఏదైనా ఆహారం ఉంచినట్లితే వాటిని శుభ్రం చేయండి. ఇంట్లో చెడిపోయిన ఆహార పదార్థాలు ఉంటే దుర్గాదేవికి చిరాకు వస్తుంది.