Vastu : ఇంట్లో ఇవి ఉన్నాయా..?వెంటనే తీసేయ్యండి…లేదంటే దరిద్రదేవత తిష్టవేస్తుంది జాగ్రత్త..!!

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 06:50 PM IST

వాస్తుశాస్త్రాన్ని నమ్మాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వారిది. కానీ ఆసియా దేశాల ప్రజలు మాత్రం వాస్తును బాగా నమ్ముతారు. ఏ వస్తువులు ఇంట్లో ఉండాలి. ఏవీ ఉండకూడదు. వీటిని బాగా పట్టించుకుంటారు. భారత్ లో భవన నిర్మాణాల్లో వాస్తు లేనిది పనిమొదలు పెట్టరు. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం..ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు వెంటాడుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డబ్బు
కొంతమంది ఎంత సంపాదించిన చేతిలో చిల్లిగవ్వ మిగలదు. ఎప్పుడు అప్పుల బాధలతో బాధపడుతుంటారు. కష్టపడితేనే డబ్బు రాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని శాస్త్రం చెబుతోంది.

ఉత్తరం.
మీరు డబ్బు దాచాలి అనుకుంటే ఆ ప్రాంతం ఉత్తరం వైపు ఉండాలి. ఇంట్లో తూర్పు, పడమర ఉంటాయి కదా. వాటిలో ఉత్తరం వైపు డబ్బును దాచుకోవాలి. అలా చేస్తే కలిసివస్తుందని చెబుతున్నారు నిపుణులు

పావురాలు
పావురాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో స్థిరత్వం ఉండదని శాస్త్రం చెబుతోంది. పావురాలు గూడు పెట్టిన ఇంట్లో సంపద ఉండదట.

తేనెటీగలు
తేనెటీగలు మంచివి. మేలు చేస్తాయి. కానీ వాస్తుప్రకారం తేనెటీగ పట్టు ఇంట్లో ఉంటే దురద్రుష్టం. కరువు తాండవిస్తుంది. ఇంట్లో గోడలపై తేనెపట్టు లేకుండా చూసుకోవాలి.

సాలెగూళ్లు
ఇంట్లో సాలెగూళ్లు ఉంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి. సాలెగూడు ఉన్న ఇంటికి చెడు జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.

పగిలిన అద్దం
ఇంట్లో పగిలిన అద్దం ఉంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. పగిలిన అద్దం ఉంటే వెంటనే తీసివేయండి. ఓ మూల పగిలింది కదా ఏం కాదు అనుకోకూడదు. పగిలిన అద్దం ఇంట్లో ఉంటే పేదరికం తాండవిస్తుంది.

నీళ్లు
డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు కదా అని పెద్దలు అంటుంటారు. అవును డబ్బుకు , నీటికి సంబంధం ఉంది. ఇంట్లో ట్యాప్ లో నుంచి నీరు కారుతుంటే..ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే కులాయిలకు నీళ్లు కారకుండా చూసుకోండి.