Astrology tips : మీకు ఆర్థిక సమస్యలున్నాయా? వీటన్నింటికీ ఒకటే పరిష్కారం..!!

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనలో చాలా మంది ఉంటారు. కొందరు ఎంత సంపాదించినా...వారి దగ్గర రూపాయి నిలవదు.

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 06:00 AM IST

ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు మనలో చాలా మంది ఉంటారు. కొందరు ఎంత సంపాదించినా…వారి దగ్గర రూపాయి నిలవదు. అలాంటివారు వాస్తుప్రకారం కొన్ని మార్పులు చేసినట్లయితే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయట. ఏం చేయాలో తెలుసుకుందాం.

బెల్లంను సాధారణంగా స్వీట్లు తయారు చేసేందుకు ఉపయోగిస్తుంటారు. కొన్ని వంటకాల్లోనూ రుచికోసం బెల్లం ను ఉపయోగిస్తారు. అయితే. ఈ బెల్లం మనిషి జీవితాన్ని కూడా మరింత తియ్యగా చేస్తుందన్న విషయం మీకు తెలుసా. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…ఒక వ్యక్తి పలు మార్గాల్లో బెల్లం ఉపయోగించడం వల్ల డబ్బు కొరతను అధిగమింవచ్చు. దీంతోపాటు ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితోపాటు గౌరవాన్ని కూడా పొందవచ్చు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బెల్లం నుంచి ఎలాంటి పరిహారం ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం.

సూర్యుని బలోపేతం చేయడానికి…
జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే.. ప్రతిరోజూ ఉదయాన్నె బెల్లం నీటిని తాగి రోజును ప్రారంభించండి. దీనితో పాటు, ఆదివారం నుండి వచ్చే 8 రోజుల పాటు ఆలయానికి 800 గ్రాముల గోధుమలు, 800 గ్రాముల బెల్లంను దానం చేయండి. దీని వల్ల మీకు మంచి జరుగుతుంది.

డబ్బు కొరతను అధిగమించడానికి…
ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నట్లయితే చిన్న బెల్లం ముక్క డబ్బు సమస్యలను తొలగిస్తుంది. ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకుని ఎరుపు రంగు గుడ్డలో నాణెంతో కట్టాలి. లక్ష్మీదేవి చిత్రం ముందు ఉంచండి. ప్రతిరోజూ పూజ చేయండి. ఐదవ రోజు, దుర్గా దేవిని పూజించిన తర్వాత, ఈ వస్త్రాన్ని తీసుకుని అల్మారాలో, భద్రంగా లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి.

రుణమాఫీ కోసం…
నిత్యం అప్పులు చేస్తుంటే పసుపు గుడ్డలో 7 ముద్దలు పసుపు, కొంచెం బెల్లం కట్టండి. మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. 21 రోజుల తర్వాత, ఈ పసుపు గుడ్డలో చుట్టిన అన్ని వస్తువులను పారుతున్న నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల రుణ విముక్తి లభిస్తుంది.

సంపద పెరుగుదల కోసం
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే, గురువారం నాడు, ఆవుకు శెనగపిండితో కలిపి బెల్లం తినిపించండి. దీంతో ధన సమస్యలు తీరుతాయి.

ఉద్యోగంలో ప్రమోషన్ పొందేందుకు
మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ, విఫలమవుతుంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే, ప్రతిరోజూ అన్నంతో పాటు కొంచెం బెల్లం కలిపి ఆవుకు ఆహారంగా పెట్టండి. ఇలా రోజూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు.

వివాహానికి ఆటంకం ఏర్పడినప్పుడు
వివాహం జరగక ఇబ్బంది పడుతున్నవారు కూడా బెల్లంతో పరిష్కారం పొందవచ్చు. ఇందుకోసం ప్రతి గురువారం గోధుమపిండిలో కాస్త బెల్లం, నెయ్యి, పసుపు వేసి ఆవుకు ఆహారంగా పెట్టండి. దాదాపు 7 గురువారాలు ఇలా చేయడం వల్ల వివాహం అవుతుంది.