Vastu : మీ ఇంట్లో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉందా? ఇలా తెలుసుకోవచ్చు…!!

మీ ఇంట్లో ఏదైనా చెడు సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఏదో శక్తి ఉంది అందుకే జరిగింది..అంటూ చాలా మంది అంటుంటారు.

  • Written By:
  • Publish Date - September 24, 2022 / 06:57 AM IST

మీ ఇంట్లో ఏదైనా చెడు సంఘటన జరిగినప్పుడు ఇంట్లో ఏదో శక్తి ఉంది అందుకే జరిగింది..అంటూ చాలా మంది అంటుంటారు. ఇలా నెగెటివ్ ఎనర్జీ ఇంట్ల ఉన్నట్లయితే వారి కుటుంబ సభ్యుల్లో అశాంతి, ఆందోళన, వ్యాధులతో బాధపడటం జరుగుతుంది. అయితే మీ ఇంట్లో నిజంగా నెగెటివ్ ఎనర్జీ ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. అయితే కొన్ని సంకేతాల ద్వారా ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని తెలుసుకోవడం సులభం అని చెబుతున్నారు జ్యోతిష్యులు. అవేంటో తెలుసుకుందాం.

ఇంట్లో ప్రతికూల శక్తి సంకేతాలు:
ప్రతికూల శక్తి గురించి ఎలా తెలుసుకోవాలి:
ప్రపంచం అనేది సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంది. కానీ చాలామంది తమ ఇంట్లో ఉన్న ప్రతికూల వస్తువుపై ద్రుష్టి పెట్టరు. అయితే ఇంట్లో ఏదైనా చెడు శక్తి లేదా దాని నీడ ఉందని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటంటే..
– గృహోపకరణాల విచ్ఛిన్నం, ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోవడం.
-దీర్ఘకాలం నుంచి కుటుంబ సభ్యుల అనారోగ్యం నయం కాకపోవడం.
-కారణం లేకుండా ఏదో ఒక విషయంలో కలత చెందడం.
-ఏదైనా మంచి పని లేదా మంచి అవకాశం ఫలాలను పొందే చివరి దశలో దూరం అవ్వడం.
-ఇంటి సభ్యులందరూ నీరసంగా ఉండటం.
-ప్రతికూల ఆలోచనలు మీ మనస్సులో పదే పదే వస్తూనే ఉంటాయి . జీవితం మీద విరక్తితో ప్రాణాలు తీసుకోవాలన్న ఆలోచన రావడం.

ఇంట్లో ప్రతికూల శక్తిని ఎలా తెలుసుకోవాలి:
ఒక గాజు టంబ్లర్‌లో నీరు పోసి అందులో గంగాజల్ పోయాలి. ఆ నీళ్లలో కొన్ని గులాబీ ఆకులను వేసి ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి. రోజంతా అలాగే ఉంచండి. 24 గంటల తర్వాత, ఈ నీటి రంగు చూడండి. నీటి రంగు పూర్తిగా మారినట్లయితే, మీ ఇంట్లో కొంత ప్రతికూల శక్తి ఉందని అర్థం. దాని పరిష్కారం గురించి మీరు ఆలోచించాలి. నీరు రంగు మారకపోతే, మీ ఇంట్లో సమస్యలకు కారణం ప్రతికూల శక్తి కాదని మీరు అర్థం.

ప్రతికూల శక్తిని ఎలా తొలగించాలి:
– నెగెటివ్ ఎనర్జీని తొలగించడానికి మీ ఇంటి ముఖద్వారాన్ని శుభ్రంగా ఉంచండి.
-నిమ్మరసం కలిపిన నీటితో తలుపు లాచెస్ , కిటికీలను శుభ్రం చేయండి.
-తుడుపు నీళ్లలో రాళ్ల ఉప్పు వేసి క్రమం తప్పకుండా తుడవాలి .
-మీకు నరఘోష ఉన్నట్లయితే 3 ఎర్ర మిరపకాయలను తీసుకుని, అందులో కొన్ని ఆవాలు వేసి, ఉప్పును సవ్యదిశలో తలపై నుండి తిప్పి ఎవరూ చూడని ప్రదేశంలో పడేయ్యండి.
-ఇంటి వంటగదిలో, ఒక కిలోన్నర ఉప్పును ఎర్రటి గుడ్డలో కట్టి, బయట ఎవరికీ కనిపించని ప్రదేశంలో ఉంచండి. ,
-పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే కొన్ని మొక్కలను ఇంట్లో నాటండి.