Tulasi Tree: మీ ఇంట్లో తులసి మొక్క ఉందా.. ఇలా చేస్తే చాలు కోటీశ్వరులవ్వడం ఖాయం?

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 06:00 AM IST

భారతదేశంలో హిందువులు తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. తులసి మొక్కను దేవతగా భావించి క్రమం తప్పకుండా పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా తులసి మొక్కను ఎప్పటినుంచో ఆయుర్వేద ఔషదాలలో ఉపయోగిస్తూనే ఉన్నారు. తులసి మొక్కను లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు అని విశ్వసిస్తూ ఉంటారు. దాంతో తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి విష్ణువు అనుగ్రహంతో పాటు తులసి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల ఆమె అనుగ్రహం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే దూరం అవుతాయి.

అంతేకాకుండా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది. తులసి చెట్టు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది.లక్ష్మీ కటాక్షం వల్ల సంపద వస్తుందని చెబుతుంటారు. క్రమం తప్పకుండా తులసి మొక్క నీరు పోయడం దీపాన్ని వెలిగించడం లాంటిది చేయాలి. తులసి మొక్క ఎంత పచ్చగా ఉంటే ఇంట్లోని వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక తులసి మొక్కను ఇంట్లో ఏ దిశలో పెట్టాలి, ఏ సమయంలో నీళ్లు పోయాలి అనేది చాలామందికి తెలియదు. తులసి చెట్టును తూర్పు దిశలో నాటాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే ఈశాన్యంలో కూడా నాటడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఈ మొక్క వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. తులసి మొక్కకు ప్రతి రోజు పూజ చేయాలి.

తులసి మొక్కకు ఎప్పుడు కూడా ఉదయం సమయంలో మాత్రమే నీరు పోయాలి. సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితులలో తులసి మొక్కకు నీరు పోయకూడదు. అలాగే ఆదివారం సమయంలో కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు. తులసి మొక్క ఎప్పుడు పచ్చగా ఏపుగా పెరగడం వల్ల ఇంట్లో సంపద వృద్ధి కూడా అలాగే పెరుగుతుంది. తులసి మొక్కకు అతి ఎక్కువగా కూడా నీళ్లు పోయకూడదు. మొక్క ఎండిపోయినా, నీళ్లు ఎక్కువై వాడిపోయినా అది ఇంటికి మంచిది కాదు. ఇక తులసి మొక్కకు నీటిని సమర్పించే సమయంలో ఒక మంత్రాన్ని పటిస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. మహాప్రసాదం జననీ, సర్వ సౌభాగ్యవర్ధినీ ఆది వ్యాధి హర నిత్యం, తులసీ త్వం నమోస్తుతే అనే మంత్రాన్ని జపించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ మంత్రాన్ని పాటించడం వల్ల అలాగే తులసి మొక్క విషయంలో చెప్పిన విషయాలు అన్ని పాటించడం వల్ల ధనవంతులవడం ఖాయం.