Vastu Tips : మీ ఇంట్లో శివుని ఫోటో ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి…!!

  • Written By:
  • Publish Date - November 12, 2022 / 07:21 AM IST

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో దేవతామూర్తుల ఫొటోలు ఉంటే శ్రేయస్సు, ఆనందం ఉంటుంది. అంతేకాదు పూజాగదిలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించినట్లయితే..సానుకూల శక్తి వస్తుంది. జీవితంలో పురోగతికి ఎంతో సహాయకారిగా ఉంటాయి. అయితే వాస్తులో ఇలాంటి అనేక నివారణాల గురించి ప్రస్తావించారు. వీటిని అనుసరించడం వల్ల సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో దేవుని ఫొటో లేదా విగ్రహం ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది.

హిందూమతంలో శివునికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే శివున్ని దేవాధిదేవ మహాదేవ అని పిలుస్తుంటారు. శివుని అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అందుకే ఇంట్లో శివుని బొమ్మ లేదా విగ్రహం పెట్టుకోవడం అంతా మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. సోమవారం నాడు శివలింగానికి గంగా జలం, ఆవుపాలు సమర్పించినట్లయితే అన్ని రకాల దోషాలు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు శివుడిని పూజిస్తే అన్ని కార్యాల్లో విజయం సాధించవచ్చని నమ్మకం.

అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శివుని ఫొటో కానీ విగ్రహం కానీ పెట్టినప్పుడు కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి. శివుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం.

1. శివుని నివాసం అయిన కైలాస పర్వతం ఉత్తరదిశలో ఉంటుంది. మీరు ఇంట్లో శివుని విగ్రహం ఉత్తర దిశలో ఉంచితే మంచిది.
2. ఇంట్లో శివుడు ఉగ్రరూపంలో ఉన్న ఫొటోను ఉంచకూడదు. ఎందుకంటే ఇది వినాశనానికి సంకేతం.
3. ధ్యానరూపంలో ఉన్న శివుని ఫొటోను ఇంట్లో ఉంచాలి. అలాంటి ఫొటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాయి.
4. ఇంట్లో శివుని విగ్రహం ప్రతిష్టించిన ప్రదేశం ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. మురికి ఉండకూడదు. విగ్రహం దగ్గర మురికి ఉంటే అది దోషాలను పెంచుతుంది. డబ్బు నష్టానికి దారి తీసే అవకాశం ఉంటుంది.