Site icon HashtagU Telugu

Debt Repayment : మీ అప్పులన్నీ తీరాలా ? ఈ పరిహారాలు పాటించండి

Debt Remedies Debt Repayment Debts Burden

Debt Repayment : చాలామంది అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతుంటారు. అప్పులను సకాలంలో తీర్చలేక సతమతం అవుతుంటారు. అలాంటివారు కొన్ని పరిహారాలను పాటిస్తే అప్పులను తీరేందుకు మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వివరాలివీ..

Also Read :DSC Update : మళ్లీ మొదలైన డీఎస్సీ కౌన్సెలింగ్‌.. సాంకేతిక సమస్యకు పరిష్కారం

  • అప్పులు బాగా ఉన్నవారు మంగళవారం ఉదయం  తలస్నానం చేయాలి.  ఆ వెంటనే ఎర్రటి వస్త్రంలో కిలో ఎర్ర కందిపప్పు మూట కట్టండి. దీన్ని దానం చేయండి. అనంతరం గుడికి వెళ్లి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. నీళ్లున్న గాజు పాత్రలో పాలరాయి(Debt Repayment) వేసి ఉంచండి.
  • అశోక చెట్టుని పార్వతీ దేవి స్వరూపం. బాగా అప్పులున్న వారు అశోక మొక్కను ఇంటి ఆవరణలో చిన్న కుండీలో ఉంచాలి. ఆ మొక్క దగ్గర శివపార్వతుల ఫొటో ఉంచి పూజించాలి.
  • ప్రతి మంగళవారం సాయంత్రం బకెట్‌లో నీళ్లు పోసి.. అందులో పాలు, పెరుగు, నెయ్యి చుక్కలు వేయాలి. రాళ్ల ఉప్పు, ఆవు పంచకం అందులో కలపాలి. ఈ నీటిని ఇంట్లోని అన్ని గదుల్లో చల్లాలి. సింహ ద్వారం బయట ఆవ నూనెతో దీపం వెలిగించాలి.
  • గులాబీ రంగు వస్త్రంలో 11 రూపాయి నాణేలు, చిటికెడు పసుపు, కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టాలి. దాన్ని ఇష్ట దైవం పాదాల చెంత ఉంచి, పూలతో పూజించాలి.
  • తెల్ల జిల్లేడు పూలను ఎక్కడైనా చెట్టు లేదా మొక్క మొదట్లో వేయాలి. అలా వేస్తే.. అప్పులు తీరేందుకు తలుపులు తెరుచుకుంటాయి.

Also Read :Sharad Pawar : రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదాకా ఈ వృద్ధుడు ఆగిపోడు : శరద్ పవార్

  • ప్రతి మంగళవారం ఇష్ట దైవం దగ్గర దీపారాధన చేయండి. తెల్ల నువ్వులతో చేసిన జీడి ఉండలను నైవేద్యంగా పెట్టాలి.
  • నానబెట్టిన కందులు, బెల్లంను మంగళవారం ఆవులకు పెట్టాలి.
  • ప్రతి మంగళవారం స్నానం చేసేటప్పుడు బకెట్టులో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలపాలి. అదే వాటర్‌తో స్నానం చేయాలి.

Also Read :Atchannaidu : లిక్కర్‌ పాలసీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.