Fish Aquarium: ఫిష్ అక్వేరియంను ఇంట్లో ఉంచుకునేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ప్రత్యేకించి పిల్లల ఆనందం కోసం చాలా మంది పేరెంట్స్ తమ ఇళ్లలో ఫిష్ అక్వేరియంను సెట్ చేయిస్తుంటారు. అయితే ఈక్రమంలో వాస్తుకు సంబంధించిన నియమాలను అస్సలు పట్టించుకోరు. తమ ఇష్టానుసారంగా, ఇంటి సౌలభ్యాన్ని బట్టి ఫిష్ అక్వేరియంను ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో పెట్టేస్తుంటారు. దీనివల్ల తలెత్తే ప్రతికూల ప్రభావాలను వారు విస్మరిస్తారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ టిప్స్ ఫాలోకండి..
- ఇంట్లో ఫిష్ అక్వేరియం(Fish Aquarium) పెట్టేందుకు బెస్ట్ దిక్కు.. ఈశాన్యం లేదా ఆగ్నేయం. ఎందుకంటే ఈ దిక్కులు శాంతి, ఆనందం, శ్రేయస్సును సూచిస్తాయి.
- అక్వేరియంలో కనీసం 9 చేపలు ఒకే జాతికి చెందినవి ఉండేలా చూసుకోవాలి. 9 చేపలలో 8 వేర్వేరు రంగులవి ఉంటే బెటర్. డ్రాగన్ షిఫ్ తప్పనిసరిగా 8వ చేప అయి ఉండాలి. అక్వేరియంలో గోల్డ్ షిఫ్ ఉండటం శుభప్రదం అని నమ్ముతారు.
Also Read :7951 Jobs : రైల్వేలో 7951 జాబ్స్.. ప్రారంభ శాలరీ నెలకు రూ.44వేలు
- చేపలు జీవశక్తికి ప్రతీక. అక్వేరియంలోని నీరు జీవితంలో మంచి శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది.
- ఇంట్లో ఫిష్ అక్వేరియం ఉంచితే అన్ని వాస్తుదోషాలను పరిష్కరిస్తుందని అంటారు. రంగు చేపలు వాటి పర్యావరణం నుంచి ప్రతికూల శక్తిని మళ్లిస్తాయి.
- ఫిష్ అక్వేరియం ఇంట్లో ఉంటే.. డబ్బు అనేది సముద్రంలో అలల లాగా ఇంట్లో ప్రవహిస్తుందని విశ్వసిస్తారు.
- అక్వేరియంలో చేపల మరణం చెడు శక్తిని వదిలించుకోవడాన్ని సూచిస్తుంది. ఫిష్ అక్వేరియం ఇంటి సభ్యులకు వచ్చే అన్ని విపత్తులను ఎదుర్కొంటుంది.
- చేపల అక్వేరియం అనేది ఇంట్లో ప్రతికూల భావోద్వేగాలను నిర్వహించడంలో పిల్లలకు సహాయపడుతుంది.
- ఫిష్ ట్యాంకులోని నీటి శబ్దం ఇంట్లో సానుకూల శక్తి, ఆనందం పెంచుతుందట.