Flowers: పక్కింట్లో పూలు మొత్తం కోసి పూజలు చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడికి పూలు సమర్పించడం అన్నది సర్వసాధారణం. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే బయట పెరట్లో గ

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 07:30 PM IST

సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు దేవుడికి పూలు సమర్పించడం అన్నది సర్వసాధారణం. అయితే దేవుడి పూజ కోసం పూలను బయట మార్కెట్ లో లేదంటే బయట పెరట్లో గార్డెన్లో పూసిన పువ్వులను లేదంటే పక్కింట్లో పూలు ఉంటే వాటిని అడిగి కోసుకొని వచ్చి పూజలు చేయడం లాంటివి చేస్తుంటాము. అయితే ఎవరైతే భక్తి పూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో.. పుష్పాన్నిగాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు తృప్తిగా స్వీకరిస్తారని చెబుతారు. చాలామంది తెలియకుండా దొంగ చాటుగా పూలు కోసుకొని వచ్చి దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు.

ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దు అంటే వాళ్ళవైపు సీరియస్ గా చూస్తూ వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటారు. అయితే వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి. మొత్తానికి అన్నీ కోసేసి బోసి మొక్కల్లా ఉంచడం మహా పాపం. ఇక ఆ ఇంట్లో వాళ్లని అడగకుండా పూలు కోసుకోవడం అంటే దొంగతనం క్రిందకి వస్తుంది.

పూలుకోసుకున్నప్పడు కూడా ఇంటి యజమానిని అడగాలి. అప్పుడు కూడా మీరు చేసే పుణ్యంలో సగం వారికి వెళ్లిపోతుంది. ఈ విషయాలు గరుడపురాణంలో ఉంటాయి. అలాగే తాంబూలం, పండ్లు, పూలు వాటిని దొంగతనం చేసినవారు అడవిలో కోతిలా పుడతార. చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసినవారు మరు జన్మలో మేకలా పుడతారు.
వాస్తవానికి పూజలు చేస్తే పుణ్యం రావాలి. మోక్షం కలగాలి. వచ్చే జన్మంటూ ఉంటే ఉత్తములుగా జన్మించాలి. కానీ ఆ ఇంటి యజమానుల్ని అడగకుండా పూలు కోసుకొచ్చి చేసే పూజల వల్ల ఎలాంటి సత్ఫలితాలు ఉండకపోగా మరింత పాపం మూటగట్టుకున్నట్లు అవుతుంది. పూలు కోసుకురావడం తప్పుకాదు కానీ ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకోవడం తప్పు. ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచకుండా మొత్తం చెట్లో ఉన్న పూలన్నీ కోసేస్తూ ఉంటారు. అలా చేయడం మరింత పాపం. ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత గానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదంటారు.