మామూలుగా మనం దిష్టి తగిలింది అనే పదాన్ని తరచుగా వింటూ ఉంటాం. ఇంటికి ఒంటికి అలాగే వ్యాపారానికి దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఈ దిష్టిని తొలగించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. నిమ్మకాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చీపురు ఇలా ఎన్నెన్నో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది నిమ్మకాయలతో దిష్టిని తీస్తూ ఉంటారు.. మరి దిష్టి తగిలినప్పుడు నిమ్మకాయలు ఉపయోగించి ఏ విధంగా దిష్టిని పోగొట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
.ఇందుకోసం మొదట నిమ్మకాయలను తీసుకొని వాటిని సగానికి కట్ చేసి, ఆ తరువాత ఆ ముక్కలను ఇంటి ప్రధాన ముక ద్వారంతో పాటుగా ఇంట్లో ఇంకా ఎన్ని డోర్లు ఉంటాయో ఆ డోర్లు కిటికీల వద్ద పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవట. అలాగే ఇంటిపై ఉండే నరదృష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీకు ఎవరైనా ఇబ్బందులను కలిగిస్తున్నట్లయితే ఒక తెల్ల పేపర్ పై నల్లని ఇంకు కలిగిన పెన్నుతో వారి పేరు రాయాలి. ఆ తర్వాత ఆ పేపర్ మడత పెట్టి దానిని సగం నిమ్మ చెక్క పైన గుచ్చాలి. ఆ చెక్కును ఎవరూ తొక్కల ప్రదేశంలో పడేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ వ్యక్తి నుంచి అయితే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయో, ఆ వ్యక్తి నుంచి మీకు ఊరట లభిస్తుందట.
అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నిమ్మకాయ పొడిని ఇంటి ప్రధాన ముక ద్వారం వద్ద చేతిలో పోసి ఊదాలి. ఈ విధంగా చేస్తే మీ పని పూర్తి చేసేందుకు కావలసిన ధైర్యం మీకు లభిస్తుందట. అదేవిధంగా మీపై ఉన్న దుష్టు తొలగిపోవాలంటే శరీరంపై ఏదైనా ఒక భాగం మీద కాఫీ పొడి రాసి అక్కడ నిమ్మచెక్కని రుద్దాలట. ఈ విధంగా చేస్తే మీపై ఉండే దృశ్యం మొత్తం పోతుందని పండితులు చెబుతున్నారు.