Site icon HashtagU Telugu

Peepal Tree: సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే.. రావిచెట్టు కొమ్మతో ఇలా చేయండి…!!

peepal tree

peepal tree

మనుషులకు సమస్యలు రావడం కామన్. ఎన్నో సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. సమస్యలు అనేవి శాశ్వతం కాదు. కొందమందికి సమస్యలు ఒకటిపోతే మరొకటి వస్తూనే ఉంటాయి. వాటినుంచి బయటపడాలంటే మాత్రం రావి చెట్టుకు పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ పూజ చేయడం వల్ల కలిగే ఫలితం గురించి తెలుసుకుందాం.

సమస్యలతో బాధపడేవారికోసం మన శాస్త్రాలు కొన్ని పరిష్కారాలు చూపిస్తున్నాయి. సమస్యల నుంచి బయటపడేందుకు చూపించిన పరిష్కాలు తెలుసుకుందాం. సూర్యోదయం అవ్వకముందే…పరగడపున రావి చెట్టు దగ్గరకు వెళ్లి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత ఒక కొమ్మను వెంట తెచ్చుకోవాలి. ఈ కొమ్మకు ఉన్న ఆకులు చక్కగా ఉండాలి. దెబ్బతినకుండా ఉండాలి. ఇలా కొమ్మను తెచ్చుకునేటప్పుడు ఒక దగ్గర మూడు ఆకులు ఉన్న కొమ్మను చూసుకోవాలి.

ఇప్పుడు ఈ కొమ్మను ఇంట్లో పూజాగదిలో ఉంచి రెండు ఆకులను ముడివేసి మూడో ఆకును ఆ ముడి నుంచి బయటకు తీయాలి. ఇలా చేసిన తర్వాత మన ఇష్టదైవానికి పూజ చేసి మనం ఎందుకోసమైతే…ఈ కార్యాన్ని చేపట్టామో ఆ పనిని మనుసులో అనుకోవాలి. ఈ కొమ్మను ఎవరూ తిరగని ప్రదేశంలో…చీపురు తగలని ప్రదేశంలో కానీ ఒక చెట్టు మీద ఉంచాలి. ఇలా చేసిన కొన్ని రోజులకు ఆ ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఆకులు ఎండిపోతున్నా కొద్దీ మన పనులు సులభంగా మారుతాయి. మొదలు పెట్టి ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభం అవుతాయి. అలాగే దేవాలయంలో ఉండే రావిచెట్టుకు, వేపచెట్టుకు నమస్కరించి ఆ చెట్ల ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఒక పెద్ద నూలు దారాన్ని తీసుకుని దానిని 9 పోగులుగ చేసి వాటికి పసుపును పూసి 9సార్లు ఆ చెట్ల మొదలుకు దారాన్ని చుడుతూ ప్రదక్షిణ చేయాలి. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు శ్రీమన్నారాయణ మేము తలపెట్టిన పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా జరిగేలా చూడు స్వామి అంటూ మనసులో అనుకోవాలి. ఇలా చేసినట్లయితే…అన్ని సమస్యలు పూర్తిగా సమసిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.