Site icon HashtagU Telugu

Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

Lakshmi Devi

Lakshmi Devi

మామూలుగా ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఏవేవో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా లక్ష్మి అనుగ్రహం కలగలేదని దిగులు చెందుతూ ఉంటారు. ఇంకొందరు లక్ష్మి అనుగ్రహం కోసం సేవా కార్యక్రమాలు పూజలు వ్రతాలు నోములు కూడా చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల పరిహారాలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు కూడా గుమ్మానికి పక్కనే చిందరవందరగా చెప్పులను విడవడం లాంటివి అసలు చేయకూడదు. గుమ్మానికి ఒక వైపు చెప్పుల స్టాండ్ లో లేదంటే వరుసగా చెప్పులను విడుచుకోవడం మంచిది.

అలాగే గుమ్మాన్ని ఎప్పుడు కాలితో తొక్కి రాకూడదు. గుమ్మాన్ని కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే సూర్యాస్తమయం సూర్యోదయం సమయంలో నిద్రించేవారు భోజనం చేసేవారు అంటే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదు. మధ్యాహ్న సమయంలో నిద్రించడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. ఎల్లప్పుడూ శుభ్రంగా పరిశుభ్రమైన బట్టలు ధరించిన వారు అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమట. చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారట. అలాంటివారికి లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడూ కలగదని చెబుతున్నారు. బద్ధకంగా ఉండేవారు ఎక్కువగా మాట్లాడే వారు, గురువులను పెద్దలను అవమానించేవారు అంటే లక్ష్మీదేవికి అస్సలు ఇష్టం ఉండదట.

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రని వస్త్రాలను, పరిమళభరితమైన పూలను అలంకరించి, ధూపదీప నైవేద్యాలను సమర్పించి, పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్ఠం అని పండితులు చెబుతున్నారు. బంగారాన్ని నడుం కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరచినట్లే. అందుకే కాళ్లపట్టాలు, మట్టెలూ వెండివి మాత్రమే ధరించాలని చెబుతున్నారు. అలాగే ఉసిరిపొడిని నీటిలో కలిపి తలస్నానం చేసి, శుచీశుభ్రతలతో దేవీభాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవికి నివేదించే పిండివంటలను నూనెతో కాకుండా నేతితో తయారుఇంకా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలట.