Site icon HashtagU Telugu

Financial Problems: అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే ఇలా చేయాల్సిందే!

Financial Problems

Financial Problems

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది అప్పుల బాధల సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా చేతిలో డబ్బులు మిగలడం లేదని, ఎన్ని పూజలు పరిహారాలు వ్రతాలు చేసిన కూడా లక్ష్మీ అనుగ్రహం కలగలేదని అంటూ ఉంటారు. అయితే అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే కొన్ని రకాల పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అప్పుల బాధల నుంచి త్వరగా బయట పడాలి అనుకునే వారు ప్రతి రోజూ స్పటిక రూపంలో ఉండే గణపతిని పూజించాలట. మీ పూజ గదిలో స్పటిక గణపతిని ఉంచి పూజలు చేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల త్వరగా అప్పుల బాధల నుంచి బయటపడే మార్గాలు కనిపిస్తాయట. అప్పుల నుంచి బయట పడాలంటే లక్ష్మీదేవి బొమ్మ ఉండే గొలుసులను మహిళలు ధరించాలట. అలాగే కుడి చేతికి కూడా లక్ష్మీ దేవి ఉన్న ఉంగరాన్ని ధరించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుందని చెబుతున్నారు. వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహానికి స్తోమతకు తగ్గట్టుగా అమ్మవారికి పూజలు చేయాలని చెబుతున్నారు.

ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందట. ఇంకా మీకు ఆర్థికంగా బాగా ఉంటే వెండి లక్ష్మీ లేని వారికి వెండి లక్ష్మీదేవి విగ్రహాన్ని దానం చేయవచ్చు అని చెబుతున్నారు. అప్పుల ఊబిలో నుంచి త్వరగా బయటపడాలి అనుకున్న వారు పుట్టింటి నుంచి లేదా పుట్టింటికి చెందిన వారి ఇంటి నుంచి రెండు ప్రమిదలు మట్టి లేదా లోహానివి తీసుకువచ్చి అందులో నూనె పోసి లక్ష్మీదేవికి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందట.