Site icon HashtagU Telugu

Black Pepper:నల్ల మిరియాలతో ఈ పని చేస్తే ఆ సమస్యలన్నీ మాయం?

Black Pepper

Black Pepper

సాధారణంగా చాలామంది నల్ల మిరియాలు తినడానికి ఇష్టపడరు. నల్ల మిరియాలు తినడానికి ఇష్టపడకపోవడానికి గల కారణం అవి ఘాటుగా ఉండటం. ఇది పొంగల్ లాంటి ఆహార పదార్థాలు వేసిన కూడా కొంతమంది పక్కన పెట్టేస్తుంటారు. కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవారు అలా చేయకూడదు నల్ల మిరియాల వల్ల మంచి లాభాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. నల్ల మిరియాల లో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల అనేక రకాల పోషకాలు అందుతాయి అని నిపుణులు చెబుతున్నారు.

అయితే నల్ల మిరియాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి బయట పడడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు మీ తలపై ఐదు నల్ల మిరియాలను దిష్టి తీసుకొని రాత్రిపూట నాలుగు కూడలిలో ఒక్కొక్క దిశలో ఒక్కొక్క మిరియాలను వదిలేయాలి. మరొక మిరియాలనే ఆకాశంలోకి విసిరి వేయాలి. ఇలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. అదేవిధంగా ఏదైనా శుభకార్యానికి వెళ్లే ముందు ఇంటి ప్రధాన ముఖద్వారం ముందు నల్ల మిరియాలు వేసి వాటిని దాటుకొని వెళ్లాలి.

ఇలా చేయడం వల్ల తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే ఈడ నుంచి ఎనిమిది నల్ల మిరియాలు తీసుకొని ఇంటిలో ఏ మూలనైనా దీపం పెట్టి వాటిని కాల్చండి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా పెరుగుతుంది. అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఐదు గ్రాములు ఇంగువ, ఐదు కర్పూరం,6 నల్ల మిరియాలు కలిపి సాయంత్రం ఇంట్లో వీటిని కాల్చాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. అదేవిధంగా అమావాస్య లేదా పౌర్ణమి రోజున ఓం క్లీన్ అనే మంత్రాన్ని జపిస్తూ దక్షిణ దిశలో నల్ల మిరియాలను విసిరేయాలి. ఈ విధంగా చేయడం వల్ల అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

Exit mobile version