Shani Dev: శని దేవునికి ఇష్టమైన ఈ పనులు చేస్తే డబ్బే డబ్బు?

Shani Dev: సాధారణంగా శనీశ్వరుడిని హిందూ శాస్త్ర ప్రకారం న్యాయ దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడు వారి కర్మను బట్టి వారికి ఫలాలను అందిస్తాడు అని చెబుతూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - October 21, 2022 / 06:30 AM IST

Shani Dev: సాధారణంగా శనీశ్వరుడిని హిందూ శాస్త్ర ప్రకారం న్యాయ దేవుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే శని దేవుడు వారి కర్మను బట్టి వారికి ఫలాలను అందిస్తాడు అని చెబుతూ ఉంటారు. అనగా మంచి చేసే వారికి అష్టైశ్వర్యాలను అందిస్తాడని, చెడు పనులు చేసే వారికి కష్టాలను పెడతాడని చెబుతూ ఉంటారు. శని దేవుడు కోపంగా ఉంటాడు అన్న విషయం వాస్తవమే అయినప్పటికీ శని దేవుడు అనుగ్రహిస్తే ఎటువంటి వారైన తప్పకుండా సంపన్నులవుతారు. శని దేవుడి కోపం ఎవరిపైన అయితే చూపిస్తాడో వారి జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తుంటే శని సరైన స్థానంలో లేకపోయినా అలాగే శనీశ్వరుడి అనుగ్రహం లేకపోయినా కూడా సమస్యలు సుడిగుండంలో చిక్కుకోరు అని నిపుణులు చెబుతున్నారు. ఎవరి జీవితాల్లో అయితే గ్రహాల కదలికలలో శనీశ్వరుడు సరైన స్థానంలో ఉంటాడో అటువంటి వారికి జీవితంలో సంతోషానికి లోటు ఉండదు. అంతే కాకుండా అష్టైశ్వర్యాలు కలిగి బంగ్లాలు సంపదలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. అనారోగ్యం సమస్యలు కూడా రావు. శనిదేవుడు నుంచి అశుభాలను ఎదుర్కొంటున్న వారు భక్తితో ఆయన్ని కొలిచి ధర్మాన్ని పాటిస్తే ఆయన ఎప్పుడూ కీడు చేయకపోగా ఆయన చల్లని దృష్టితో వారిని కాపాడుతాడు.

ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కోర్టు కేసులు, శత్రువుల పీడ నుంచి విముక్తి కలగాలంటే శని దేవుడికి మొక్కి ఆ నియమాలు పాటించాలి. అయితే మనం ఎప్పుడు అయినా శనీశ్వరుడిని ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు బిక్షగాళ్లకు, పేదవారికి మన స్తోమతకు తగ్గట్టుగా ధన, వస్త్ర, వస్తు, ఆహార రూపంలో దానధర్మాలు విశాల హృదయంతో చేస్తే మంచి శుభాలు కలుగుతాయట. అటువంటి వారికి శని దేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే రెండు మీటర్ల పొడవు ఉన్న నల్లటి వస్త్రం తీసుకొని పూజ చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని దానం చేయాలి. అది వారు ఉపయోగించునేలా ఉండాలి. అలాగే దానం పశుపక్షాదులకు చేయాలి. ఎప్పుడు అయినా సరే ఉన్నవారికి చేస్తే ఆ ఫలితం దక్కదు.