ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ప్రతి పదిమందిలో ఆరుగురు ఈ ఆర్థిక సమస్యల కారణంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం కోసం అనేక రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. పూజలు దానధర్మాలు వంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. మీ జన్మ నక్షత్రం లేదా మీకు నచ్చిన వారం నాడు లేదా మీ అదృష్ట సంఖ్యను బట్టి గానీ కస్తూరి కాయను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలట. ఆ తర్వాత స్నానం చేసి దాన్ని పూజా మందిరంలో ఉంచి, పసుపు, కుంకుమలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలట. అనంతరం నాలుగు గురివింద గింజలు కూడా దానిలో వేసి నమస్కారం చేసుకోవాలట. ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని “అంతా పరమాత్మ లీల నేను నిమిత్త మాత్రుని సర్వం శివమయం జగత్” అని మనసులో చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవాలట.
అనంతరం పూజ కార్యక్రమాలు చేపట్టి, ఆ కస్తూ రికాయను మీ ఇంట్లో ధనం దాచుకునే చోట ఉంచాలట. ఇలా చేస్తే మీకు సర్వ సంపదలు సిద్ధిస్తాయట. మీ వంశం కూడా అభివృద్ధిలోకి వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ కాయ తరతరాలుగా పనిచేస్తుందట. ఇప్పుడు చెప్పినట్టుగా కస్తూరి కాయతో ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలను ప్రయోజనాలను పొందవచ్చు అని, మార్పుని మీరే గమనించవచ్చు అని చెబుతున్నారు.