Site icon HashtagU Telugu

Diwali: లక్ష్మీ అనుగ్రహం కావాలా.. అయితే దీపావళికి వారం ముందే ఇలా చేయండి!

Diwali

Diwali

త్వరలోనే దీపావళి సెలబ్రేషన్స్ కూడా మొదలు కానున్నాయి. దసరా పండుగ తర్వాత ఒక్క 15 రోజుల గ్యాప్ తో దీపావళి పండుగ రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు జరుపుకునే పండుగలలో ఈ దీపావళి పండుగ కూడా ఒకటి. అయితే దీపావళి పండుగ రోజు టపాసులు పేల్చడం దీపాలను వెలిగించడం ఎంత ముఖ్యమో అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా అంతే ముఖ్యం. ఈరోజున లక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీతో పాటు, అమ్మవారి అనుగ్రహం, అదృష్టం వరిస్తాయి. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని అదృష్టవంతులు అవుతారట.

దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం. కానీ వారం ముందు నుంచే లక్ష్మీ అనుగ్రహం కోసం ప్రార్థించాలట. అది కూడా పాలతో పూజించాలని చెబుతున్నారు. దీపావళికి కేవలం వారం ముందు లేదా దీపావళి కంటే ముందు ఒక వారం రోజుల పాటు ఇక్కడ వివరించబోతున్న చిన్న చిట్కా ఫాలో అయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. సూర్యాస్తమయం సమయంలో అంటే సాయంత్రం పూట ఒక లీటరు పాలు కొని ఇంటికి తీసుకురావాలి. ధనం, అదృష్టం పొందాలంటే ఆ పాలలోకి కొద్దిగా తేనె, గంగాజలం కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి.

ఒక భాగాన్ని స్నానానికి ఉపయోగించాలి. రెండో సగం మిశ్రమాన్ని మీ ఇంటి పైకప్పు, ఎంట్రెన్స్, అన్ని గదుల్లోనూ చిలకరించాలి. మిగిలిన మిశ్రమాన్ని మెయిన్ డోర్ బయట చల్లేయాలి. ఇలా వారం రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అంతే మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. ఆర్థిక సమస్యలు దూరమై కావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుందని, ధనం, అదృష్టం పొందాలంటే. ఇలా దీపావళి రావడానికి వారం ముందు మొదలుపెట్టి పండుగ రోజు వరకు చేయాలని చెబుతున్నారు. అప్పుడు మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందగలుగుతారట. ధనం పొందుతారట. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయని చెబుతున్నారు.