Site icon HashtagU Telugu

Spiritual: తులసి కుండలోని మట్టితో కోటీశ్వరులు అవ్వవచ్చట.. అదెలా అంటే!

Spiritual

Spiritual

హిందువుల ప్రతి ఒక్కరి ఇళ్లలో దాదాపుగా తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కను పవిత్రంగా భావించడంతోపాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు శాంతి నెలకొంటాయని నమ్మకం. వీటితో పాటు తులసి మొక్కకు సంబంధించి కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయిట. ముఖ్యంగా తులసి కోటలోని మట్టితో మీరు కోటీశ్వరులు కావచ్చట. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు, డబ్బు కొరత అప్పులు,అధిక ఖర్చులు వంటి సమస్యలు ఉంటే అలాగే ఏదైనా ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే తులసి కుండీలోని మట్టి మిమ్మల్ని రక్షిస్తుందట. దీని కోసం మీరు మీ ఇంట్లోని తులసి మొక్క నుంచి ఒక పిడికెడు మట్టిని తీసుకొని దానికి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ముడి వేయాలి. ఇప్పుడు దీనిని మీరు ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తీరి మీ సంపద కూడా పెరుగుతుందట. మీ వివాహ జీవితంలో సమస్యలు ఉంటే. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం క్షీణిస్తున్నట్లయితే, తులసి మొక్క నుండి కొంత మట్టిని రాగి పాత్రలో వేయాలి. తరువాత దానికి సింధూరం, పసుపు కలపాలి.

దీని తరువాత పాత్రను ఒక గుడ్డతో కప్పి, మీ పడకగదిలో ఉంచాలి. ఇది మీ వైవాహిక జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుందట. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందట. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ వివాదం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉండదు. అలాంటప్పుడు తులసి కుండ నుండి మట్టిని తీసుకొని మట్టి దీపంలో నింపి దానిపై కర్పూరం వేసి ప్రతిరోజూ దాని పొగను ఇంట్లో వ్యాపింపజేయడం వల్ల ఇది ఇంట్లో కుటుంబ శాంతిని నెలకొల్పుతుందట. అలాగే కెరీర్ ఆగిపోయినా, ఉద్యోగం పొందడంలో ఇబ్బంది ఉన్నా, మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకోవాలని అనుకున్నా కూడాఎక్కడా ఎంపిక కాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వచ్చినా, వ్యాపారంలో లాభాలు రావాలి అన్నా మీరు విద్యా రంగంలో పురోగతి సాధించలేకపోయినా వీటన్నింటి నుండి బయటపడటానికి, తులసి కుండ మట్టితో తయారు చేసిన గంధపు పేస్ట్‌ ను ప్రతి రోజూ మీ నుదిటిపై పెట్టుకోవాలట. ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు.