Site icon HashtagU Telugu

Vastu: నవరాత్రి అష్టమి రోజున లవంగాలతో ఇలా చేస్తే.. డబ్బుకు కొరత ఉండదు!!

Cloves

Cloves

మన ఆరోగ్యం మన వంటగదిలోనే ఉంటుంది. ఆరోగ్యంతో పాటు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చాలా సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి. మన వంటగదిలో లభించే మసలా దినుసుల్లో లవంగం ఒకటి. ఇది సాధారణంగా వంటల్లో వాడేందుకు ఉపయోగపడుతుంది. కానీ ఇది కొన్ని ప్రత్యేక నివారణలకు కూడా ఉపయోగపడుతుంది. మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభించాలంటే ఈ లవంగాలతో ఎన్నో పరిహారాలు చేయవచ్చు. శారదీయ నవరాత్రులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి లవంగాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అమ్మవారికి లవంగాలు నైవేద్యంగా పెట్టడం వల్ల ఇంట్లోని అన్ని సమస్యలు కూడా తీరిపోతాయని నమ్ముతుంటారు.

అయితే మీ వైవాహిక జీవితంలో ఏదైనా అడ్డంకులు ఉంటే…లవంగాలు అడ్డంకులను వదిలించుకోవడానికి సహాయపడతాయి. నవరాత్రులలో, కర్పూరాన్ని లవంగాలతో కాల్చడం వల్ల ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. దాని పొగ ఇంట్లో నుండి దుష్ట శక్తులను దూరం చేస్తుంది.

భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలంటే :
మీ ఇంట్లో కారణం లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే నవరాత్రులలో అష్టమి నాడు మహాగౌరిని పూజించి అమ్మవారికి తేనె నైవేద్యంగా సమర్పించాలి. దీంతో అమ్మవారి ముందు 7 గులాబి రేకులను తీసుకుని అందులో 2 లవంగాలు వేసి అమ్మవారి పాదాల చెంత నైవేద్యంగా పెట్టి పూజిస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

వైవాహిక జీవితంలో ప్రేమను పెంచడానికి :
మీ వైవాహిక జీవితంలో భర్తతో గొడవలు పడుతుంటే.. నవరాత్రుల అష్టమి రోజున, ఎరుపు వస్త్రంలో 3 లవంగాలు కట్టి ఆలయానికి దానం చేయండి. ఈ పరిహారంతో, పరస్పర వివాదాలు దూరం అవుతాయి. భార్యభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అష్టమి రోజున మాత గౌరీకి ఒక జత లవంగాలను నైవేద్యంగా పెట్టి పాలలో లేదా టీలో వేసి భర్తకు తాగిపించండి. లవంగం యొక్క ఈ పరిహారం వైవాహిక జీవితంలో ప్రేమను కూడా నింపుతుంది. .

వివాహం కోసం:
మీ వివాహానికి ఆటంకాలు ఉంటే, నవరాత్రి అష్టమి నాడు, 4 లవంగాలతో 2 ముద్దల పసుపును తీసుకుని, ఇంటికి సమీపంలోని ఆలయంలో గౌరీదేవికి సమర్పించండి. మీ కోరికలు నెరవేరాలని ప్రార్థించండి.

సంపద కోసం :
మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే..5 లవంగాలను పూజాగదిలో లక్ష్మీదేవి ముందు ఉంచండి. నవరాత్రుల తర్వాత వాటిని బీరువాలో భద్రపరచండి. ఇలా చేస్తే మీకు ఆర్థిక సమస్యలు తీరి..డబ్బుకు కొరత ఉండదు.