Site icon HashtagU Telugu

Tulsi Parihar: మీ ఇంట్లో డబ్బు కొరత ఉండకూడదంటే.. తులసితో ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Mixcollage 19 Jun 2024 03 35 Pm 4637

Mixcollage 19 Jun 2024 03 35 Pm 4637

హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. హిందువులు తులసి మొక్కను పవిత్రంగా భావించడంతో పాటు, ప్రతీ రోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఉదయం సాయంత్రం రెండు పూటలా తులసి మొక్క వద్ద దీపం వెలిగించి అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. తులసి కోట వద్ద ప్రతిరోజు దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతుంటారు. అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని కూడా చెబుతారు.

అందుకే తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఏ కొదవా ఉండదు. మరి ఇంట్లో డబ్బుకు కొరత ఉండకూడదంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట తులసి మంజరిని తీసుకుని ఎర్రటి బట్టలో కట్టి, దానిని మీరు డబ్బును దాచే ప్రదేశంలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు ఉండవు. ఈ మంజరిని మీ పర్సులో పెట్టుకోవడం వల్ల కూడా మీ పర్సులో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే శుక్రవారం రోజు హిందువులు లక్ష్మీదేవి ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు.

శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజలో మంజరిని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అమ్మవారి అనుగ్రహం కలిగి మీ సంపద కూడా పెరుగుతుంది. అలాగే నెగటివ్ ఎనర్జీ వల్ల ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోవాలి అంటే మంజరిని కలిపిన నీటిని మీ ఇంటి మూలాల్లో చల్లాలి. దీనివల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అలాగే ఎప్పటినుంచో పెళ్లి కాకుండా అలాగే ఉంటున్నవారు తులసి మంజరిని పాలలో కలిపి శివలింగానికి సమర్పించాలి. ఈ పరిహారం వల్ల మీ వైవాహిక జీవితంలోని అన్ని అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి.