Sunset: సూర్యాస్తమయం సమయంలో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే?

చాలామంది కష్టపడి ఎంత సంపాదించినప్పటికీ అనుకున్నది సాధించకపోగా సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా ఏదో ఒక రకమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబ

Published By: HashtagU Telugu Desk
Sunset

Sunset

చాలామంది కష్టపడి ఎంత సంపాదించినప్పటికీ అనుకున్నది సాధించకపోగా సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా ఏదో ఒక రకమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అపజయాలు ఎదురవుతున్నపుడు ఒకసారి వాస్తు ఎలా ఉందో చూసుకోవడం మంచిది. అటువంటి వారు సూర్యాస్తమయం సమయంలో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు పండితులు. ఆ పరిహారాలు ఏంటి అన్న విషయానికొస్తే.. కష్టపడి డబ్బు సంపాదించడంతోపాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.

కొందరికి వాస్తు ప్రకారం గా కూడా సరిగా కలిసి రాక నష్టం జరుగుతుంది. చేసేప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి విముక్తి పొందడానికి తోడ్పడే పరిహారాలు శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. ఉదయం,సాయంత్రం సమయాలను ప్రదోశ వేళలు అంటారు. ఈ సమయంలో చేసే శుభకార్యాలు లక్ష్మీ కటాక్షానికి కారణం అవుతాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో తప్పకుండా సూర్య నమస్కారం చేసుకోవాలి. ఇది సాకారత్మక శక్తి ప్రసారానికి దోహదం చేస్తుంది. సాయకాలం సమయంలో చేసే పూజకు చాలా మహత్తు ఉంటుంది. సంద్యా సమయంలో ఇంట్లోని పూజా మందిరంలో, తులసి ముందు దీపం వెలిగించాలి.

సూర్యాస్తమయం సమయంలో అంటే సాయం సంధ్య వేళ ఇంట్లో దీపం వెలిగించి వెలుగును ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇంట్లోకి చీకటి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. చీకటి నెగెటివ్ ఎనర్జీకి ఆలవాలంగా ఉంటుంది. ఒకసారి నెగెటివిటీ ఇంట్లో ప్రవేశిస్తే కష్టాల పరంపర మొదలవుతుంది. సంధ్య వేళలో నిద్రపోవడ మంచిది కాదు. అది ఉదయ సంధ్య అయినా సాయం సంధ్య అయినా సరే. అందుకే ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలని పెద్దలు చెబుతుంటారు. సాయం సంధ్య వేళలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. ఇలా పడుకుంటే లక్ష్మి అలిగి వెళ్లి పోతుందట. సంధ్యా లక్ష్మీని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. సూర్యాస్తమయ సమయంలో తప్పనిసరిగా పితరులను తలచుకొని వారి దీవెనలకోసం వేడుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల వంశంలోని పూర్వీకుల దీవెనెల వల్ల జీవితంలో దురదృష్టం ఎదురుకాకుండా ఉంటుంది. జీవితం విజయపథంలో నడుస్తుందని నమ్మకం. పితరుల దీవెనలు లేకపోతే జీవితంలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతాయి. కాబట్టి రోజు ఒకసారి పెద్దలను స్మరించుకొవడం వల్ల వారి దీవెనలు పొందవచ్చు.

  Last Updated: 09 May 2023, 05:35 PM IST