Site icon HashtagU Telugu

Amavasya: ప్రతి అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు.. అప్పులన్నీ తీరిపోవడం ఖాయం!

Amavasya

Amavasya

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోందని బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుల సమస్యల నుంచి బయటపడటం కోసం అనేక పూజలు పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా ఆర్థిక ఇబ్బందులు మాత్రం తొలగిపోవు. అలాంటప్పుడు అమావాస్య రోజు ఒక పని చేస్తే చాలు తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్మ నక్షత్రం ఉంటుంది. ఈ జన్మ నక్షత్రాలతో కొన్ని రోజులు కూడా వస్తాయి. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోవాలి. తర్వాత అమావాస్య రోజు ఉదయం నిద్ర లేచి సంప్రదాయ దుస్తులు ధరించి పూజకు అన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత తయారుచేసిన మామిడి చెక్కపీలు తీసుకొని ఆ చెక్కకు పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టాలి. తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీ దేవి అమ్మవారి ఫోటో లైదంటే విగ్రహం పెట్టాలి. ఇత్తడి చెండు లేదంటే వెండి చెంబుకు కంకణం కట్టి కళషంగా చేయాలి. అందులో నీళ్లు పోసి, లవంగాలు, యాలాకులు, దాల్చిన చెక్క, పచ్చ కర్పూరం వేయాలి. చెంబులో మామిడాకులు పెట్టి అందులో కొబ్బరికాయ పెడితే కళశం స్థాపన అవుతుంది.

తరువాత లక్ష్మీ అమ్మవారికి 108 ఎర్ర గులాబీలు, లేదంటే 108 తామర పువ్వులు సమర్పించుకోవాలి. నైవేద్యానికి ఏదైనా ఒక తియ్యని ప్రసాదాన్ని రెడీ చేసుకోవాలి. అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రి కూడా దీపారాధన చేసుకొని, ధూప, దీప, నైవేద్యాలు చెల్లించుకోవాలి. తరువాత చంద్రుడిని దర్శనం చేసుకొని నేలపైన పడుకోవాలి. పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకొని పడుకోవాలి. మరుసటి రోజు ఉదయమే లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని పూజా గదిలోకి వెళ్లి అక్కడు ఉన్న కళశంలోని నీటిని ఒక బాటిల్‌ లో పోసుకోవాలి. పూజకు సంబంధించిన పువ్వులు, కర్పూరం, అగరబత్తీలు ఉపయోగించినవి ఏవైతే ఉన్నాయో, వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో కట్టివేసి ఏదైనా నదిలో వేయాలి. కళశం నీరు పోసుకున్న బాటిల్‌ కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయాలి. ఇలా ప్రతీ అమావాస్యకు చేసుకుంటూ ఉండాలి. బాటిల్‌ లో ఉన్న కళశపు నీటిని మొక్కలకు పోయాలి. ప్రతీ అమావాస్యకు ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం చేసిన అప్పులు క్రమంగా తీరిపోతాయట.