Site icon HashtagU Telugu

Good Luck: అదృష్టం కలిసి రావాలంటే ఈ పనులు చేయాల్సిందే?

Good Luck

Good Luck

వాస్తు శాస్త్రంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం, అలాగే సంతోషంగా ఉండడం కోసం, అదృష్టం కలిసి రావడం కోసం ఇలా ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి. అయితే మనం కష్టపడుతున్న దానికి అదృష్టం తోడవ్వాలి అంటే కొన్ని రకాల చిట్కాలను క్రమం తప్పకుండా పాటించాల్సిందే. మరి ఎటువంటి చిట్కాలను పాటించడం ద్వారా అదృష్టం మన వెంటే ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడం కోసం ఉదయం స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల జాతకంలో గ్రహాన్ని బలపరుస్తుంది. అంతే కాకుండా విష్ణువు అనుగ్రహం తప్పక లభిస్తుంది.

అలాగే సాయంత్రం సమయంలో తల స్నానం చేసేవారు అందులో కాస్త ఉప్పు కలుపుకొని స్నానం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఈ విధంగా చేయడం వల్ల త్వరలో అదృష్టం కూడా పెరుగుతుంది. అలాగే అదృష్టం కలిసి రావాలి అంటే ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. మరి ముఖ్యంగా పంచముఖ ఆంజనేయస్వామిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల తన భక్తులను సమస్యల నుంచి గట్టెక్కిస్తాడు. ఇందుకోసం మంగళవారం రోజున పంచముఖి హనుమంతుని ముందు దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో సంపద పెరుగుతుంది. కష్టాల నుండి విముక్తి పొంది శత్రువులపై విజయం సాధిస్తారు. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే ప్రతిరోజు సాయంత్రం తులసి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి.

అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని తప్పకుండా వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉండడంతో పాటు సానుకూలత ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో క్రమం తప్పకుండా పూజ చేసినప్పుడు శంఖం గంట శబ్దాలను చేయడం వల్ల ఆ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణ జరిగి ప్రతికూలత తొలగిపోతుంది. వీటిని పాటించడంతో పాటుగా మన ఇంట్లో పాడైన విద్యుత్ ఉపకరణాలు, చెత్తాచెదారం, ఆగిపోయిన గడియారం, తుప్పు పట్టిన తాళాలు, విరిగిన పాత్రలు, చిరిగిన బట్టలు వంటివి ఉంటే వెంటనే వాటిని తొలగించండి. అలాంటివి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు.