Site icon HashtagU Telugu

Puja: పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం ఈ పూజలు చేయండి

On March 14, Shitala Saptami.. Health Problems Will Be Removed With Special Pujas

On March 14, Shitala Saptami.. Health Problems Will Be Removed With Special Pujas

Puja: పిల్లలు భవిష్యత్తు అభివృద్ధి కోసం పిల్లలతో గణపతి సరస్వతి పూజ సూర్యనమస్కారం హయగ్రీవ స్తోత్రాలు చేయిస్తుండాలి. అదే పిల్లల భవిషత్తు బాగుండటం కోసం వారు క్రమశిక్షణతో మంచి అలవాట్లు ఆలోచన, విద్య, బుద్ది కోసం తల్లిదండ్రులు దక్షిణామూర్తిని ఆరాధించాలి. ముఖ్యంగా గురువారం రోజు శివాలయంలో పసుపు రంగు వస్త్రం పైన బియ్యం పిండి తో రెండు చిన్న ప్రమిధలు పెట్టి నేతి దీపాలు పెట్టి దక్షిణామూర్తి స్త్రోత్రం చేయాలి.

నానబెట్టిన పచ్చి శెనగల దండ దక్షిణామూర్తికి వేయాలి 9 ప్రదర్శనలు చేయాలి, ఇలా 9 గురువారాలు చేయాలి. కాలేజ్ సీట్ కోసం, వీసా కోసం, ఉద్యోగం కోసం, అలాగే పిల్లలు మొండి తనంతో ఇబ్బందులు పడే తల్లిదండ్రులు ఇలా చేస్తే వారిలో మార్పు వస్తుంది. పిల్లల కోసం తల్లి ఈ పూజ చేయవచ్చు. #ఎవరి కోసం చేస్తారో వారి షర్ట్ భుజాన వేసుకుని చేయవచ్చు. అలాగే 9 గురువారాలు కొబ్బరి చిప్పలో దీపారాధన చేయడం, నానబెట్టిన శెనగలు ఆవుకి తినిపించడం, కుక్కకు చపాతీలు పెట్టడం వల్ల ఉద్యోగం లో ఆటంకాలు తొలగుతాయి.

ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అవకాశం వస్తుంది ప్రమోషన్ ఆటంకాలు తొలగి పోతుంది, రాబోయే గండం తప్పుతుంది. పిల్లలు యొక్క మానసిక పరివర్తన లో మార్పువస్తుంది ఇది వ్యాపార సమస్యలు కూడా తీరుతుంది. ఇది చేయడం ఖర్చు లేదు శ్రమ లేదు నమ్మకంతో భక్తితో చేయాలి ఎంతో మందికి గొప్ప ఫలితం ఇచ్చింది. దత్త పారాయణ చేయడం, దత్త ప్రదర్శన, దత్తాత్రేయ స్తోత్రం, పాలు నైవేద్యం పెట్టి చేయడం వల్ల అనేక కుటుంబ సమస్యలు ఆర్ధిక ఇబ్బందులు తొలిగిపోతుంది. గురువారానికి లక్ష్మీ వారం అని పేరు గురువు అనుగ్రహంవల్ల ఆరాధన వల్ల లక్షి కటాక్షం కలుగుతుంది.