Site icon HashtagU Telugu

Vastu: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేయండి..!!

Goddess Lakshmi Kanakadhara Stotram

Goddess Lakshmi Kanakadhara Stotram

లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే లక్ష్మీదేవిని ఆరాధించేవారికి దేనికీ లోటు ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ ఉండేలా కొన్ని నియమాలు పాటించాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, మనస్సును శుభ్రంగా ఉంచుకోవడం, బద్దకాన్ని వదలడం, ఇవేకాదు ఉదయం నిద్రలేవగానే వెంటనే చేసే ఒక్క పని కూడా ఇంట్లో లక్ష్మీదేవిని ఎల్లపుడూ స్థిరంగా ఉండేలా చేస్తుంది. అలా చేస్తే ఆమె దీవెనలు ఉంటాయి.

ఉదయం సమయం అత్యంత శక్తివంతమైంది. ఈ సమయంలో ఎప్పుడూ మీరు సానుకూల శక్తిని ఇచ్చే పనులను చేయాలి. సానుకూల శక్తితో ఉదయాన్ని ప్రారంభిస్తే…మీరు రోజంతా అర్థవంతంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలంటే మీరు ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. అంతేకాదు ఉదయం నిద్రలేవగానే అరచేతులను చూసుకోండి. ఈవిధంగా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

1. అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అరచేతుల పైభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, మూలాధారంలో బ్రహ్మ ఉంటారని పండితులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయాన్నే నిద్రలేచి అరచేతిని చూడటం చాలా శ్రేయస్కరం.

2. ఇలా అరచేతులను చూసుకోవడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతిని చూడటం వల్ల విద్యాదేవి అయిన సరస్వతి, సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం, ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. దేవదూతల దయ మనపై ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి కష్టాలైన సరే సులభంగా ఎదుర్కొవచ్చు.

3. ఉదయాన్నే మీ రెండు చేతులను చూస్తూ ‘కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే బ్రహ్మ ప్రభాతే కరదర్శనం’ అని అనుకోండి. ఇప్పుడు రెండు అరచేతులను మీ ముఖంపైన పెట్టండి. అరచేతులలో బ్రహ్మతీర్థాలు, ఋషితీర్థాలు, దేవతీర్థాలు, ప్రజాపతిలు, పితృతీర్థాలు, అగ్నితీర్థాలు కూడా ఉన్నాయి.

4. మీ అరచేతులను చూసిన తర్వాత ఈ మంత్రాన్ని జపించడం ద్వారా, ఒక వ్యక్తి క్రమంగా సమస్యల నుంచి బయటపడతాడు. మీరు ఏకాగ్రతతో ఉన్నప్పుడు, మీరు ప్రశాంతంగా ఉంటారు.

5. గ్రహాలు సరిగా పనిచేయని వారు నిద్రపోయిన తర్వాత వెంటనే అరచేతిని చూడాలి. అంగై దర్శనం తర్వాత ఇంటి పెద్దలకు నమస్కరించాలి.